Song Details
Lyrics
తెల్ల తెల్ల వారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా ఆ దేవ దేవుడే పంపగ ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టేనంట బ్రహ్మ కళ్లలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్లీ లాలీ పాడేనంట వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువై కొమ్మ హారతి పళ్ళెం హాయిగ నవ్వే వదినమ్మా వచ్చిందమ్మా వచ్చిందమ్మా నింగిన చుక్కల రెమ్మ నట్టింట్లో నెలవంక ఇక నువ్వమ్మా తెల్ల తెల్ల వారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా... సాంప్రదాయణి శుద్ధపద్మిణి ప్రేమ శ్రావణి సర్వాణి (2) చరణం: 1 యద చప్పుడు కదిలే మెడలో తాళవనా ప్రతి నిమిషం ఆయువునే పెంచెయ్యనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోనా కళలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగనాచి కూన ముళ్ళోకాలు మింగే మూతి ముడుపుదాన ఇంద్ర ధనుస్సు దాచి రెండు కళ్ళలోన నిద్ర చెరిపేస్తావే అర్ధ రాతీరైనా ఏ రాకాసి రాశో నీది ఏ గడియల్లో పుట్టావే అయినా వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువై కొమ్మ నా ఉహల్లోన ఉరేగేది నువ్వమ్మా వచ్చిందమ్మా వచ్చిందమ్మా నింగిన చుక్కల రెమ్మ నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా చరణం: 2 ఏకాంతలన్ని ఏకాంతం లేక ఎకరువే పెట్టాయి ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగ లేక కష్టం నష్టం అనే సొంత వాళ్ళు రాక కన్నీరొంటరాయె నిలువ నీడ లేక ఎంత అదృష్టం నాదే నంటూ పగ పట్టిందే నాపై జగమంతా... నచ్చిందమ్మా నచ్చిందమ్మా నచ్చిందమ్మా జన్మ నీలో సగమై బతికే భాగ్యం నాదమ్మా మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నుదుటన కుంకుమమ్మ ఓ వెయ్యేళ్ల ఆయుష్ అంటూ దివించండమ్మ తెల్ల తెల్ల వారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా
Lyrics sourced from public databases. May contain errors.