MovieGQ

Inkem Inkem

Geetha Govindam (2018) · Track 1 of 5

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

తదిగిన తకజను తదిగిన తకజను తరికిట తధరిన తద్దింధీంత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం పల్లవి: ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలవే ఇకపై తిరణాల్లే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కోగంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చస్తున్నానే ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలవే ఇకపై తిరణాల్లే తదిగిన తకజను తదిగిన తకజను తరికిట తధరిన తద్దింధీంత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం చరణం: 1 ఊహలకు దొరకని సొగసా ఊపిరిని వదలని గొలుసా నీకు ముడి పడినది తెలుసా మనసున ప్రతి కొసా నీ కనుల మెరుపుల వరసా రేపినది వయసున రభస నా చిలిపి కలలకు బహుశా ఇది వెలుగుల దశ నీ యెదుట నిలబడు చనువే వీసా అందుకొని గగణపు కొనలే చూసా ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలవే... ఇకపై తిరణాల్లే చరణం: 2 మాయలకు కదలని మగువా మాటలకు కరగని మధువా పంతములు విడువని బిగువ జరిగినదడగవా నా కధని తెలుపుట సులువా జాలిపడి నిమిషము వినవా ఎందుకని గడికొక గొడవ చెలిమిగ మెలగవ నా పేరు తలచితె ఉబికే లావా చల్లబడి నను నువు కరుణించేవా ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలవే ఇకపై తిరణాల్లే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కోగంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చస్తున్నానే ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలవే ఇకపై తిరణాల్లే తదిగిన తకజను తదిగిన తకజను తరికిట తధరిన తద్దింధీంత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Geetha Govindam

See All