MovieGQ

Innallu

Eeswar (2002) · Track 4 of 7

Song Details

Lyrics

ఇన్నాళ్లు చూడకున్నా ఏనాడో పోల్చుకున్నా నీ నీడై నిలిచి ఉన్నాననీ ఇన్నాళ్లు చెంతనున్నా ఈనాడే చెప్పుకున్నా నీ కోసం బతికి ఉన్నాననీ కొలువుండిపో ప్రాణమై ఇలా ఎద నిండిపో అనురాగమా ఇన్నాళ్లు చెంతనున్నా ఈనాడే చెప్పుకున్నా నీ కోసం బతికి ఉన్నాననీ చరణం: 1 స్వప్నమో సత్యమో తెలుసుకోవద్దనీ చూపుతో చెప్పనీ రెప్ప వేయొద్దనీ ఎప్పుడూ నిన్నిలా చూస్తుంటే చాల్లే అనీ మబ్బుల్లో జాబిల్లినీ గుప్పిట్లో పొందాలని నమ్మాలి అనిపించని ఊహల్లో నన్నుండనీ ఇన్నాళ్లు చూడకున్నా ఏనాడో పోల్చుకున్నా నీ నీడై నిలిచి ఉన్నాననీ చరణం: 2 నేననే మాటనే మరిచిపోయాననీ నిన్నిలా అల్లుతూ కొత్తగా పుట్టనీ ఇప్పుడీ జన్మకి నీ పేరులే పెట్టనీ నిట్టూర్పులన్నింటినీ నిన్నల్లో వదిలెయ్యనీ రానున్న వెయ్యేళ్లనీ ఈ పూట ఉదయించనీ ఇన్నాళ్లు చెంతనున్నా ఈనాడే చెప్పుకున్నా నీ కోసం బతికి ఉన్నాననీ ఇన్నాళ్లు చూడకున్నా ఏనాడో పోల్చుకున్నా నీ నీడై నిలిచి ఉన్నాననీ కొలువుండిపో ప్రాణమై ఇలా ఎద నిండిపో అనురాగమా ఇన్నాళ్లు చూడకున్నా ఏనాడో పోల్చుకున్నా నీ నీడై నిలిచి ఉన్నాననీ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Eeswar

See All