MovieGQ

Oka Manasunu

Ee Abbai Chala Manchodu (2003) · Track 3 of 8

Song Details

Lyrics

ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావూ ఆ ముడి ఒక కొంగుముడయ్యేదాకా ఊరుకోవూ ప్రేమా... ఆ...ఆ...ఆ...ఆ...ఆ ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావూ ఆ ముడి ఒక కొంగుముడయ్యేదాకా ఊరుకోవూ ప్రేమా... ఆ...ఆ...ఆ...ఆ...ఆ చరణం: 1 పసి పాపలో ముసినవ్వులా కపటాలు లేని ప్రేమా మునిమాపులో మరుమల్లెలా మలినాలు లేని ప్రేమా అరచేతిలో నెలవంకలా తెరచాటులేని ప్రేమా నదిగొంతులో అలపాటలా తడబాటులేని ప్రేమా మనసుల కలిమిడి ఫలితం ప్రేమ తనువుల తాకిడి కాదు సుమా అనంత జీవ యాత్రలో తోడు ప్రేమా ప్రేమా... ఆ...ఆ...ఆ...ఆ...ఆ ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావూ ఆ ముడి ఒక కొంగుముడయ్యేదాకా ఊరుకోవూ చరణం: 2 అధరాలలో తడి మెరుపులా మెరిసేది కాదు ప్రేమా హృదయాలలో ధృవతారలా అలరారుతుంది ప్రేమా పరువాలతో కరచాలనం చేసేది కాదు ప్రేమా ప్రాణాలలో స్థిరబంధనం నెలకొల్పుతుంది ప్రేమా మమతల అమృత వర్షిణి ప్రేమ కోర్కెల అలజడి కాదు సుమా నిశీధిలోనూ వీడిపోని నీడ ప్రేమా ప్రేమా... ఆ...ఆ...ఆ...ఆ...ఆ ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావూ ఆ ముడి ఒక కొంగుముడయ్యేదాకా ఊరుకోవూ ప్రేమా... ఆ...ఆ...ఆ...ఆ...ఆ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Ee Abbai Chala Manchodu

See All