MovieGQ

Are Eelakotti

Eduruleni Manishi (2001) · Track 6 of 6

Song Details

Lyrics

పల్లవి: అరె ఈల కొట్టి గోలపెట్టే పిల్లా పిల్లా నీ జోలికొచ్చి జోడికట్టి కొడతా జెల్లా (2) నీ ఈడు ఈత చెట్టు నీ కులుకు పూల కొట్టు నీ సోకు మినప అట్టు అది నాకు పంచి పెట్టు హయ్యె రామ గడుసోడివే అబ్బో దసరా బుల్లోడివే అరె ఈల కొట్టి గోలపెట్టే పిల్లా పిల్లా నీ జోలికొచ్చి జోడికట్టి కొడతా జెల్లా చరణం: 1 ఎగిరే పైటల్లో గుండుసూది ఉంది అది నా గుండెల్లో గుచ్చుతోంది తడిమే చేతుల్లో ఉడుము దాగివుంది అది నా నడుముల్లో ఆడుతోంది రగిలే సోకుల్లో భలే కుంపటున్నది బిగిసే కౌగిట్లో నన్నే కాల్చుతున్నది మెరిసే నా ఒంట్లో పెట్టె మంచమున్నది ముసిరే చీకట్లో నిసే వాల్చామన్నది అందమైన పసిదానివే హోయ్ అంతు చూసే కసిదానివే పొద్దుటేలా దొరబాబువే మాపటేల దొంగోడివే అరె ఈల కొట్టి గోలపెట్టే పిల్లా పిల్లా నీ జోలికొచ్చి జోడికట్టి కొడతా జెల్లా... కోరస్: హయ్యయ్యో సుబ్బు సుబ్బు హయ్యయ్యో హయ్యయ్యో సుబ్బు సుబ్బు చరణం: 2 మిరప తోటల్లో ఘాటు రేగుతుంది నువు వాటేస్తే అలా మండుతున్నది చెరుకు చేలల్లో తీపి తగులుతుంది అది నవ్ ముద్దిస్తే దొరుకుతుంది మావి పిందుల్లో అదో వగరు ఉంటది నువు నా వెంటొస్తే అచ్చు అలా ఉన్నది మల్లె పందిట్లో మరో లోకముంటది అల్లే సందిట్లో అదే మైకమున్నది హ పిచ్చి నీకు ముదిరిందిలే వరస బాగా కుదిరిందిలే పిల్ల చాలా నిరాజానలే అయిన జోడి అదిరిందిలే అరె ఈల కొట్టి గోలపెట్టే పిల్లా పిల్లా నీ జోలికొచ్చి జోడికట్టి కొడతా జెల్లా నీ ఈడు ఈత చెట్టు నీ కులుకు పూల కొట్టు నీ సోకు మినప అట్టు అది నాకు పంచి పెట్టు అరెరె హయ్యె రామ గడుసోడివే అబ్బో దసరా బుల్లోడివే సిగ్గు చూస్తే చిన దానివే గుండెదోచే చిత్రాంగివే..

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Eduruleni Manishi

See All