Song Details
Lyrics
నిమిషం నిమిషం గడిచింది చూడు కాలం గడిచే సమయం నడిపింది వింతజాలం నీకైనా... నాకైనా... గత క్షణములోన జరిగింది కాస్త మార్చేయటం సులభమా మరు క్షణములోన జరిగేది ఏంటొ ఊహించటం సాధ్యమా... నిమిషం నిమిషం గడిచింది చూడు కాలం నీకైనా... నాకైనా... మరు క్షణములోన జరిగేది ఏంటొ ఊహించటం సాధ్యమా... గాయాలు చేసేసేది ఈకాలమే గాయాన్ని మాన్పించేది ఈ కాలమే గాయాలు చేసేసేది ఈకాలమే గాయాన్ని మాన్పించేది ఈ కాలమే తనకే లేదు ప్రేమా జాలీ కరునా మనకే పోదు మనపై మమతా తపనా కాలసంద్రానికే ఎదురీతే కాదా బ్రతుకంటే... నిమిషం నిమిషం గడిచింది చూడు కాలం గడిచే సమయం నడిపింది వింతజాలం కధ మలుపు తిప్పించేది ఈ కాలమే కన్నీళ్లు తెప్పించేది ఈ కాలమే కధ మలుపు తిప్పించేది ఈ కాలమే కన్నీళ్లు తెప్పించేది ఈ కాలమే తానే కరిగీ నిన్నే కదిపీ కుదిపీ తానే తరిగీ నిన్నే తరిమీ తరిమీ ఒక్క క్షణకాలమే వెంటాడేనంటా కలకాలం నిమిషం నిమిషం గడిచింది చూడు కాలం గడిచే సమయం నడిపింది వింతజాలం నీకైనా... నాకైనా... గత క్షణములోన జరిగింది కాస్త మార్చేయటం సులభమా మరు క్షణములోన జరిగేది ఏంటొ ఊహించటం సాధ్యమా... నిమిషం నిమిషం గడిచింది చూడు కాలం నీకైనా... నాకైనా... మరు క్షణములోన జరిగేది ఏంటొ ఊహించటం సాధ్యమా...
Lyrics sourced from public databases. May contain errors.