MovieGQ

Chaliraathiri Vastavani

Donga Ramudu and Party (2003) · Track 3 of 6

Lyrics

పల్లవి: చలిరాతిరి వస్తావని చిరు వేసవి తెస్తావని మునిమాపుల తెర చాటున చూశా మరి వేచా బిగికౌగిలి కొస్తావని బిడియాలే దోస్తావని ఎద వాకిట గిలిగింతగా పూసే నా ఆశ ప్రాయాలే పంచాలి నులివెచ్చగా కాలాలే తోచాలి సరికొత్తగా గతజన్మల పరిచయమే బతికించెను మన కలలే పులకింతల తొలివలపే కలిగించెను పరవశమే ప్రాణమైన ప్రేమా మన ప్రేమా హాయి పేరు ప్రేమా మన ప్రేమా చలిరాతిరి వస్తావని చిరు వేసవి తెస్తావని మునిమాపుల తెర చాటున చూశా మరి వేచా చరణం: 1 పరువాల తెర తీసే చొరవే దొరికేనా క్షణమైనా గడిపేస్తే వరమే ఒడిలోనా హృదయాలే వెలిగించే గుణమే ఈ ప్రేమ విరహాలే కరిగిస్తే సుఖమే జడివాన గాలైనా రాకుండా మన దారిలో హాయేదో పెరిగింది మలిసందెలో భారాలే తీరంగా మది లోపలా గానాలే చేసింది ఎలకోయిల నలువైపుల రాగాలే మధువొలికే మేఘాలై వానవిల్లు విరిసే మరి విరిసే తేనెజల్లు కురిసే మది కురిసే చలిరాతిరి వస్తావని చిరు వేసవి తెస్తావని మునిమాపుల తెర చాటున చూశా మరి వేచా చరణం: 2 తనువుల్లో మనసుల్లో జ్వరమే ఈ ప్రేమ చిగురేసి చైత్రంలా పెరిగే లోలోన అరుదైన విలువైన చెలిమే ఈ ప్రేమ తపియించే ఎదలోన చినుకై కురిసేనా చుక్కలనే దాటించి అలవోకగా ఎక్కడికో చేర్చేది వలపే కదా మక్కువతో వేధించి ప్రతి జాములో చెక్కిళ్ళు నిమిరేటి చలువే కదా మునుపెరుగని మురిపాలు ముదిరాయి సరదాలు పూలజల్లు ప్రేమా మన ప్రేమా తీపి ముల్లు ప్రేమా ఈ ప్రేమా చలిరాతిరి వస్తావని చిరు వేసవి తెస్తావని మునిమాపుల తెర చాటున చూశా మరి వేచా బిగికౌగిలి కొస్తావని బిడియాలే దోస్తావని ఎద వాకిట గిలిగింతగా పూసే నా ఆశ ప్రాయాలే పంచాలి నులివెచ్చగా కాలాలే తోచాలి సరికొత్తగా గతజన్మల పరిచయమే బతికించెను మన కలలే పులకింతల తొలివలపే కలిగించెను పరవశమే ప్రాణమైన ప్రేమా మన ప్రేమా హాయి పేరు ప్రేమా మన ప్రేమా చలిరాతిరి వస్తావని చిరు వేసవి తెస్తావని మునిమాపుల తెర చాటున చూశా మరి వేచా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Donga Ramudu and Party

See All