MovieGQ

Nallanchu Tella Cheera

Donga Mogudu (1987) · Track 1 of 6

Song Details

Lyrics

పల్లవి: నల్లంచు తెల్లచీర ఓ..ఓ.. తల్లోన మల్లెమాలా ఓ..ఓ..ఈడెక్కి కవ్వించితే భామా.. వేడెక్కి నేరేగనా.. ముసిరే మిసమిసలే గుసగుసగా వలవిసిరే హొయ్ బుగ్గల్లో సిగ్గులూర ఒహొ... చూడొద్దు తేరిపారా ఒహొకోరేవు మోమాటము రాజా... రేపేవు ఆరాటమూ విరి తూపుల జడిలో పడి వసివాడేను సొగసే... హొయ్ చరణం: 1 సాగే వన్నెవాగే నన్ను... కమ్మేసిందిరో ఊగే కన్నెలాగే నన్ను ...లాగేసిందిరో మూగే మూగ సైగే నన్ను ...ముద్దాడిందిరో ఊగే తీగలాగే మేను... అల్లాడిందిరో గాజుల బాజాలతో ...జాజులు ఊరేగెనే మోజుల రోజాలతో ...రోజులు ఎదురేగెనే తనివే తీరని... తనిమే ఊరనీ జతలో గతులే... జతులై... బుగ్గల్లో సిగ్గులూర ఒహొ... చూడొద్దు తేరిపారా ఒహొ నల్లంచు తెల్లచీర ఓ..ఓ.. తల్లోన మల్లెమాలా ఓ.. చరణం: 2 కాగే ఈడు కోరే వేడి ఉందీ లోయలో రేగే చల్లగాలే ముంచుతుంది మాయలో రాలే మంచుపూలే పెంచె నాలో దాహము జాలేలేని చలిలో దించుతుంది మోహము కౌగిలి చెరసాలలో ...ఈ చెలి చిక్కాలిలే పెదవుల సరసాలలో... కోరిక కరగాలిలే మరిగే మరులనే... నదులై పారనీవిరులే జడిసే ఒడిలో....ఏహ్.. నల్లంచు తెల్లచీర ఓ..ఓ.. తల్లోన మల్లెమాలా ఓ..ఓ..ఈడెక్కి కవ్వించితే భామా.. వేడెక్కి నేరేగనా ముసిరే మిసమిసలే గుసగుసగా వలవిసిరే హొయ్.. బుగ్గల్లో సిగ్గులూర ఒహొ... చూడొద్దు తేరిపారా ఒహొ కోరేవు మోమాటము రాజా... రేపేవు ఆరాటమూ విరి తూపుల జడిలో పడి వసివాడేను సొగసే... హొయ్

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Donga Mogudu

See All