MovieGQ

Ee Chempaku Selaveeyaku

Donga Mogudu (1987) · Track 2 of 6

Song Details

Lyrics

పల్లవి: ఈ చెంపకు శలవీయకు ఈ పెదవిని వదిలేయకు చాలని అనకు రాతిరి మనకు మోహాలు సంకెళ్ళు విడిపోనీకు... హోయ్ ఈ చెంపకు శలవీయకు ఈ పెదవిని వదిలేయకు చరణం: 1 నీ వేళ్ళు చేసే అల్లరి కుచ్చెళ్ళు పాడే పల్లవి తుఫాను రేగే ముందర ముస్తాబు దేనికి దండగ కంటి చూపు చీర కట్టాలి ఒంటిని కంచి పట్టు చీర జారాలి నేలనీ ఈ వేడీలో వాడనీ ...ఈ గాలినీ పూలనీ... గండి పడ్దది నింగి చెరువుకి వెండి వెన్నెల పొంగుతున్నదీ గోరింత తుళ్ళింత వెల్లువయ్యేలా.... హోయ్ ఈ చెంపకు శలవీయకు ఈ పెదవిని వదిలేయకు చాలని అనకు రాతిరి మనకు మోహాలు సంకెళ్ళు విడిపోనీకు... హోయ్ చరణం: 2 పై పైకి రాకు సూర్యుడా పొద్దంటే మాకు చేదురా తెల్లారుతున్నా తీరక అల్లాడుతోందీ కోరికా కక్ష గట్టి వచ్చి మా తలుపు తట్టకు వెలుగు వలలు తెచ్చి మా తలలు పట్టకు ఈ రేయిని ఆగనీ... ఈ హాయినీ సాగనీ... పాలపుంతలో పూల వేడుక కౌగిలింతలో ఇలకు జారక తాపాల దాహాలు తీరిపోయేలా... ఈ చెంపకు శలవీయకు ఈ పెదవిని వదిలేయకు చాలని అనకు రాతిరి మనకు మోహాలు సంకెళ్ళు విడిపోనీకు... హోయ్

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Donga Mogudu

See All