Song Details
Lyrics
వయసేమో పదహారు పరుగెత్తే సెలయేరు పరువాల చిత్రాలు పడుచోళ్ళ ఆత్రాలు నిదరోయే నేత్రాలు నిలువెల్లా గాత్రాలు మతిపోయే అందాలు శతకోటి దండాలు వాన వాన వల్లప్ప తిరుగుదామిలా నింగినేల హరివిల్లై కలుపుదామిలా మబ్బుల్లో హంసలాగ మల్లెల్లో మంచులాగ కన్నుల్లో సిగ్గులాగ వెన్నెల్లో ముగ్గులాగ దోసిట్లో చినుకులాగ వాకిట్లో తులసిలాగ వరిచేను గువ్వలాగ పెదవుల్లో నవ్వులాగ మనమంతా గంతులాడదాం సిరిమువ్వై చిందులాడుదాం సరదాగా ఆటలాడుదాం పరువాల పాట పాడుదాం వాన వాన వల్లప్ప తిరుగుదామిలా నింగినేల హరివిల్లై కలుపుదామిలా ఓహోహో తయ్యర తయ్య తయ్యారె తయ్యారె తయ్యర తయ్య తయ్యారె తయ్యారె అహ తుళ్ళిపడే ఈడులో తుమ్మచెట్టు నీడలో చెమ్మచెక్క ఆటలాడుదాం పొద్దుపొడుపు వేళలో అత్తమడుగు వాగులో ఆదమరిచి ఈదు లాడుదాం పక్కింటిలోన కుర్రాడ్ని కడుపుదామా ఆహ ఆహ ఆహ హా పక్కింటిలోన కుర్రాడ్ని కడుపుదామా మాటలతో మాయచేసి కథకాలి చేయిద్దామ గుండ్రంగా తిప్పిద్దామా గుంజీలే తీయిద్దామా గుండ్రంగా తిప్పిద్దామా గుంజీలే తీయిద్దామా వాన వాన వల్లప్ప తిరుగుదామిలా నింగినేల హరివిల్లై కలుపుదామిలా గడ్డివాము చాటుగా లంకచుట్ట ఘాటుగా గుప్పు గుప్పుమంటు లాగుదాం ఊరు పెద్ద గుట్టుగా రంగితోటి పచ్చిగా కులుకుతున్న మాట చాటుదాం కోవెల్లో చేరి కోలాటమాడేద్దామా డింకి టకరి డింక హే డింకి టక అ ఆ కోవెల్లో చేరి కోలాటమాడేద్దామా వీధుల్లో చేరి మనం వసంతాలు ఆడేద్దామా వయ్యారం వలికిద్దామా సంగీతం పలికిద్దామా వయ్యారం వలికిద్దామా సంగీతం పలికిద్దామా వాన వాన వల్లప్ప తిరుగుదామిలా నింగినేల హరివిల్లై కలుపుదామిలా ఓహోహొ మబ్బుల్లో హంసలాగ మల్లెల్లో మంచులాగ కన్నుల్లో సిగ్గులాగ వెన్నెల్లో ముగ్గులాగ దోసిట్లో చినుకులాగ వాకిట్లో తులసిలాగ వరిచేను గువ్వలాగ పెదవుల్లో నవ్వులాగ మనమంతా గంతులాడదాం సిరిమువ్వై చిందులాడుదాం సరదాగా ఆటలాడుదాం పరువాల పాట పాడుదాం లాల లాల లాలలా లాల లాల ల లాల లాల లాలలా లాల లాల ల
Lyrics sourced from public databases. May contain errors.