Song Details
Lyrics
ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో నీ ఊసులే మొదలాయెనే ఈ వేళా... ఎందుకో ఏమిటో నిదురింక రాదేమిటో కనుపాపాలో కల కాదుగా ఈ మాయా... ఎపుడు లేనిది నాలో అలజడి ఎవరు చెప్పలేదే ప్రేమని ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో నీ ఊసులే మొదలాయెనే ఈ వేళా... ప్రేమనే మాటకి అర్ధమే నాకు రాదే ఎవ్వరో చెప్పగా ఇప్పుడే తెలిసెనే నీ జతే చేరగా నా కధే మారిపోయే లోకమే బొత్తిగా గుర్తుకే రాదులే చినుకై చేరిన వరదై పోయెనే ఎవరూ అపలేరే ప్రేమని ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో నీ ఊసులే మొదలాయెనే ఈ వేళా... గాలిలో వేలితో ఆశలే రాసుకోన నీవనే ప్రేమని శ్వాసగా పీల్చనా నీటిలో నీడలో నిన్నిలా చూసుకోన ఊహలో తేలుతూ ఊసులే ఆడనా లోకం ఎంతగా మారిందే ఇలా పగలే జాలువారే వెన్నెలా ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో నీ ఊసులే మొదలాయెనే ఈ వేళా...
Lyrics sourced from public databases. May contain errors.