Sogasu Chuda
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- S.P. Balasubrahmanyam
Lyrics
- సొగసు చూడ హాయి హాయి లే
తెలిసె నేడు ఇంత హాయి హాయి
చెలియ చూపు నీకు హాయి లే
చెలిమి లోన ఉంది హాయి హాయి
అందాలు చూడ జన్మ చాలునా
అందించగానే ఆశ తీరునా
అహో ఇదెంత వింత మొహమో
సొగసు చూడ హాయి హాయి లే
తెలిసె నేడు ఇంత హాయి హాయి
నువ్వంటే నేనంటు నేనంటే నువ్వుంటు
నీవెంటే నేనుండనా
నీ నవ్వే ముద్దంటు ఇంకేమి వద్దంటూ ముడిపడినా
నీకోసం పుట్టాను నీ దారే పట్టాను నీ మీదే ఒట్టేయనా
నాచేత చేయ్యెట్టు నన్నిట్ట జోకొట్టు ఒడిలోన
చెట్టా పట్టా కట్టే దెట్టో ఇట్టే చెప్పేయాలమ్మో
చెట్టు పుట్టా చూసేవేళ తప్పేదెట్టయ్యా
కుమారి చెంప కెన్ని కెంపులో
భరించు కళ్లకెన్ని రంగులో
అహో ఇదెంత వింత మోహమో
సొగసు చూడ హాయి హాయి లే
తెలిసె నేడు ఇంత హాయి హాయి హాయి
నా పాల బుగ్గల్లో దీపాల సిగ్గుల్లో నీ పాలు పంచివ్వనా
నీ వెంట వెన్నెల్లో నీ గుండె చప్పుల్లు వినలేనా
హద్దుల్నే దాటాలి వద్దన్నా చూడాలి నీ కన్నె కవ్వింపులు
కాదన్నా లేదన్నా కౌగిట్లో పాడాలి పదనిసలు
నిన్నా మొన్నా లేనే లేని వైనం ఎంతో బాగుంది
వన్నె చిన్నే ఊరించాకే ప్రాణము లాగింది సయ్యటలాడు ఎంత తొందరా
వయ్యారి ఈడు కెన్ని చిందులో
సుఖాల తీరమెంత దూరమో
సొగసు చూడ హాయి హాయి లే
తెలిసె నేడు ఇంత హాయి హాయి
చెలియ చూపు నీకు హాయి లే
చెలిమి లోన ఉంది హాయి హాయి
అందాలు చూడ జన్మ చాలునా
అందించగానే ఆశ తీరునా
అహో ఇదెంత వింత మొహమో
Dharma Chakram
Movie More SongsSogasu Chuda Keyword Tags
-
-