Atu Nuvve Itu Nuvve
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- అటు నువ్వే ఇటు నువ్వే మనసెటుచూస్తే అటునువ్వే
ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతిచోటా నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే
ఆదమరుపైనా పెదవులపైన ప్రతిమాటా నువ్వే
అపుడు ఇపుడు ఎప్పుడైనా నా చిరునవ్వే నీ వలన
తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే
పరిచయమంతా గతమేనా గురుతుకు రాదా క్షణమైనా
ఎదురగ ఉన్నా నిజమే కాని కలవైనావులే
చరణం: 1
రంగు రూపమంటూ లేనేలేనిదీ ప్రేమా
చుట్టూ శూన్యమున్నా... నిన్ను చూపిస్తూ ఉంది
దూరం దగ్గరంటూ తేడా చూడదీ ప్రేమా
నీలా చెంత చేరీ నన్ను మాటాడిస్తోంది
కనుపాప లోతులో దిగిపోయి ఇంతలా
ఒక రెప్పపాటు కాలమైనా మరపే రావుగా
ఎద మారుమూలలో ఒదిగున్న ప్రాణమై
నువు లేని నేను లేనే లేను అనిపించావుగా
అటు నువ్వే ఇటు నువ్వే మనసెటుచూస్తే అటునువ్వే
ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతిచోటా నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వే అలికిడివింటే అదినువ్వే
ఆదమరుపైనా పెదవులపైన ప్రతిమాటా నువ్వే
చరణం: 2
నాకే తెలియకుండా...! నాలో నిన్ను వదిలావే
నేనే నువ్వయ్యేలా ప్రేమగుణమై ఎదిగావే
మాటే చెప్పకుండా...! నీతోనువ్వు కదిలావే
ఇటుగా చూడనంటూ...! నన్ను ఒంటరి చేశావే
ఏకాంతవేళలో ఏ కాంతి లేదురా నలుసంత కూడ జాలి లేని పంతాలేంటిలా
నీ తోడు లేనిదే మనసుండలేదురా
నీ పేరు లేని ప్రేమనైనా ఊహించేదెలా
అటు నువ్వే ఇటు నువ్వే మనసెటుచూస్తే అటునువ్వే
ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతిచోటా నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే
ఆదమరుపైనా పెదవులపైన ప్రతిమాటా నువ్వే
- అటు నువ్వే ఇటు నువ్వే మనసెటుచూస్తే అటునువ్వే
Current
Movie More SongsAtu Nuvve Itu Nuvve Keyword Tags
-
-
-