Virisina Indra Chapamo (Padyam)
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- పల్లవి:
విరిసిన ఇంద్ర చాపమో...
భువిన్ ప్రభవించిన చంద్ర బింబమో...
మరు పువుబంతియో.. రతియో.. మల్లెల దొంతియో.. మోహకాంతియో
సరస కవీంద్ర కల్పిత రసాకృతియో .. నవ రాగ గీతియో ఓ...
వర సరసీరుహానన ..విరాన.. వరించి.. తరింప చేయవే...ఏ ఏ ఏ ఏ...
పగటి పూట చంద్ర బింబం అగుపించెను
ఏదీ?.. ఏదీ?
అందమైన నీ మోమే అది గాకింకేది
కానరాని మన్మథుడేమో కనిపించెను
ఏడీ?.. ఏడీ?
ఎదుట ఉన్న నీవేలే ఇంకా ఎవరోయి
చరణం: 1
వన్నె వన్నె తారలెన్నో కన్ను గీటి రమ్మన్నాయి
వన్నె వన్నె తారలెన్నో కన్ను గీటి రమ్మన్నాయి
ఏవి?.. ఏవి?
అవి నీ సిగలోనే ఉన్నాయి
పదును పదును బాణాలేవో యెదను నాటుకుంటున్నాయి
పదును పదును బాణాలేవో యెదను నాటుకుంటున్నాయి
ఏవి?.. ఏవి?
అవి నీ ఓర చూపులేనోయి
పగటి పూట చంద్ర బింబం అగుపించెను
ఏదీ?.. ఏదీ?
అందమైన నీ మోమే అది గాకింకేది
చరణం: 2
ఇంత చిన్న కనుపాపలలో..ఎలా నీవు దాగున్నావు?
ఇంత చిన్న కనుపాపలలో..ఎలా నీవు దాగున్నావు?
ఇంత లేత వయసున నీవు ఎంత హొయలు కురిపించావు?
ఇంత లేత వయసున నీవు ఎంత హొయలు కురిపించావు?
ఏమో?.. ఏమో?
ఇరువురి మనసులు ఒకటైతే ఇంతే ఇంతేనేమో...
ఆహాహా హాహహాహా ఓహొహోహో హోహో
ఆహాహా హాహహాహా ఓహొహోహో హోహో
- పల్లవి:
Chikkadu Dorakadu
Movie More SongsVirisina Indra Chapamo (Padyam) Keyword Tags
-
-
-