Chekka Bhajana
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Lyrics
- పల్లవి:
ఇజ్జుఇజ్జుదా... దా.. దా.. దా
జుజ్జుజుదా... దామ్మ.. దా.. దా
దొడ్డిదారి వైపునా.. గడ్డి వామి చాటునా
చేసేది ఏముంది చక్కభజన... చెప్పేది ఏముంది చేతిభజన
చేసేది ఏముంది చక్కభజన... చెప్పేది ఏముంది చేతిభజన
ఇజ్జుఇజ్జుదా... దా.. దా.. దా
జుజ్జుజుదా... దామ్మ.. దా.. దా
దొడ్డిదారినొచ్చినా.. దొంగ గడ్డి మేసినా
చెప్పేందుకేముంది చంపభజన... చేసేందుకేముంది చెంగుభజన
చెప్పేందుకేముంది చంపభజన... చేసేందుకేముంది చెంగుభజన
ఇజ్జుఇజ్జుదా... దా.. దా.. దా
జుజ్జుజుదా... దామ్మ.. దా.. దా
చరణం: 1
చుర్రు.. ఆ చుర్రు... చుర్రుమన్న సూరీడు చూరుజారిపోయాక
బిర్రు.. ఆ బిర్రు... బిర్రుగున్న నీ చూపు బిట్టుదారిపోయాక
చీకటమ్మ నీడలో... చింతలేని వాడలో
కవ్వింతే కాస్తమొలిపించు... రవ్వంతా ముద్దు తినిపించు
కౌగిలింతలివ్వమంటా.. గాలిలాగా కెవ్వుమంటా
వస్తే.. ఈడొస్తే... నీలోనే ఇల్లు కట్టనా
అందాక నేనింక ఆగగలనా...
అందాక నేన్నింక ఓపగలనా
అందాక నినింక ఆగగలనా...
అందాక నిన్నింక ఓపగలనా
ఇజ్జుఇజ్జుదా... దా.. దా.. దా
జుజ్జుజుదా... దామ్మ.. దా.. దా
చరణం: 2
జివ్వు.. ఆ జివ్వు.. జివ్వుమన్న నా ఈడు తోడు కోరుకున్నాక
నవ్వు.. ఆ నవ్వు.. నవ్వులన్నీ గూడల్లే నేను కట్టుకున్నాక
మల్లెపూలతోటలో మంచె కింద ఆటలో
వయసంతా అగ్గిపెట్టించు
ఒళ్లంతా వేడిపుట్టించు
తేనెలన్నీ పిండుకుంటా.. తుమ్మెదల్లే వండుకుంటా
వస్తే.. నే వేస్తా స్వర్గాల దాక నిచ్చెనా
ఆ మాట నువ్వంటే ఆపగలనా.. ఎందాక పోతుందో పాడుభజన
ఆ మాట నువ్వంటే ఆపగలనా.. ఎందాక పోతుందో పాడుభజన
ఇజ్జుఇజ్జుదా... దా.. దా.. దా
జుజ్జుజుదా... దామ్మ.. దా.. దా
దొడ్డిదారి వైపునా.. గడ్డి వామి చాటునా
చెప్పేందుకేముంది చంపభజన... చెప్పేది ఏముంది చేతిభజన
చెప్పేందుకేముంది చంపభజన... చేసేది ఏముంది చక్కభజన
- పల్లవి:
Chattamtho Poratam
Movie More SongsChekka Bhajana Keyword Tags
-
-