MovieGQ

Annula Minnula

Chanti (1992) · Track 1 of 8 · 4:51

Song Details

Music Director
Lyricist

Lyrics

అమ్మలారా కొమ్మలారా కన్నె గౌరి వన్నె మీరే తియ్యరారే దిష్టి మీరే ఇవ్వరారే చిమ్మి నూరే శ్రీలొలుకు నోములకే చాయనిడే పసుపులు స్త్రీ కొరకు చేతులకె సొంపసగె గాజులూ అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే సుమ సుందరి అందెలలో చిరు మువ్వల సందడులే సుభ మంగళ వేలలో సుభమస్తుల దీవెనలే అలివేనే ఈ రాణి... అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గులమొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే ఆ దేవుడు ఆ దేవితో అలకపూనెనేమో ఈ రూపుగ శ్రీదేవిని ఇలకు పంపెనేమో మొహనాల సొయగాల మేనకో మరి దేవలోక పారిజాత మాలికో రేకులు విచ్చిన సిరి మల్లి అన్నల ముద్దుల చెల్లి నేలకు వచిన జాబిల్లి వన్నెల రంగుల వల్లి విరబూసే పూభోని... అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే సుమ సుందరి అందెలలో చిరు మువ్వల సందడులే సుభ మంగళ వేలలో సుభమస్తుల దీవెనలే అలివేనే ఈ రాణి... అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే ఆ కలువలు ఈ కనులకు మారు రూపులేమో ఆ నగవులు వేకువలకు మేలుకొలుపులేమో పాలకడలి మీద తేలు చంద్రికో గగనాల వేలకాంతులీదు తారకో వెన్నెల్లా వస్తాడు ఓనాడు రాజంటి గొప్పింటి మొగుడు ఊరంతా సందడ్లు ఆనాడు వాడంతా వియ్యాలవారు పిపి పీ పీ డుమ్ డుమ్ డుమ్... అహా... హా... అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే సుమ సుందరి అందెలలో చిరు మువ్వల సందడులే సుభ మంగళ వేలలో సుభమస్తుల దీవెనలే అలివేనే ఈ రాణి... అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Chanti

See All