MovieGQ

Chirunavvula Tholakarilo

Chanakya Chandragupta (1977) · Track 5 of 6

Lyrics

పల్లవి: హ..హ..హ..హ..హ చిరునవ్వుల తొలకరిలో.. సిరిమల్లెల చినుకులలో చిరునవ్వుల తొలకరిలో.. సిరిమల్లెల చినుకులలో పలికెనులే.. హృదయాలే.. పలికెనులే.. హృదయాలే.. తొలివలుపుల కలయికలో చిరునవ్వుల తొలకరిలో.. సిరిమల్లెల చినుకులలో చరణం: 1 వసంతాలు దోసిట దూసి.. విసిరేను నీ ముంగిలిలో తారలనే దివ్వెలు చేసి.. వెలిగింతు నీ కన్నులలో నీవే నా జీవనాడిగా...ఆ..ఆ నీవే నా జీవనాడిగా.. ఎగిసేను గగనాల అంచులలో.. ఓ..ఓ.. విరియునులే ఆ గగనాలే.. నీ వెన్నెల కౌగిలిలో.. ఓ..ఓ..ఓ చిరునవ్వుల తొలకరిలో.. సిరిమల్లెల చినుకులలో..ఓ చరణం: 2 ఉరికే సెలయేరులన్నీ... వొదిగిపోవు నీ నడకలలో ఉరిమే మేఘా..ఆ.ఆ లన్నీ.. ఉలికి పడును నీ పలుకులలో నీవే నా పుణ్యమూర్తిగా..ఆ..ఆ నీవే నా పుణ్యమూర్తిగా..ఆ.. ధ్యానించు నా మధుర భావనలో.. ఓ..ఓ.. మెరియునులే ఆ భావనలే.. ఇరు మేనుల అల్లికలో..ఓ..ఓ చిరునవ్వుల తొలకరిలో.. సిరిమల్లెల చినుకులలో..ఓ ఆ..ఆ.. పలికెనులే.. హృదయాలే.. తొలివలుపుల కలయికలో.. ఓ..ఓ..ఓ.. చిరునవ్వుల తొలకరిలో.. సిరిమల్లెల చినుకులలో.. చిరునవ్వుల తొలకరిలో.. సిరిమల్లెల చినుకులలో..ఓ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Chanakya Chandragupta

See All