Song Details
Lyrics
పల్లవి: చామంతి పువ్వే చిందులేసె చూడు సంబరాల జాతరలో చామంతి పువ్వే చిందులేసె చూడు సంబరాల జాతరలో సాగరాన పూసే స్వాతిముత్యమల్లే మట్టిలోన కాచే మంచి వజ్రమల్లే అందం చూస్తే అదురు తప్పదు తళుకు బెళుకు అరెరరె సీమ దొరవంటి మావ నీడలోన చామంతి పాడింది సీమ దొరవంటి మావ నీడలోన చామంతి పాడింది చరణం: 1 పక్కనున్న వాడు చక్కనైన తోడు అంత అందగాడు చెంద లేవు నీవు అందం చూస్తే అదురుతుందిలే బిగువు బింకం అరెరరె సీమ దొరవంటి మావ నీడలోన చామంతి పాడింది సన్నజాజి జాతిమొక్క నీ పైడి పంట సందెవేళ చేరవచ్చి సింధులేసెనంట చిన్నవాడి కళ్ళలోన వలలు వేసెనంట తందనాలు మాటులోన తాను నీకు జంట మత్యమహరాణి అలివేణి మనసేవణి సన్నజాజి తీగ పలికించే రసరాగిణి కుండ తేనెల పట్టు అది కోయిల కేదో గుట్టు తొలి పరువం మృదువ వనం ………… హే సీమ దొరవంటి మావ నీడలోన చామంతి పాడింది చామంతి పువ్వే చిందులేసె చూడు సంబరాల జాతరలో చరణం: 2 కోటలాంటి పేటలెన్నో ఏలుతున్నవాడే కోట్ల కొద్ది ఆస్తివున్నా కొంటెమనసు వాడే మేడలోన బామ్మగారి ముద్దు బిడ్డ వీడే ఊరికంత వాడకంత కోటికొకడు వీడే మొక్కుబడులు చేస్తాం తలవంచి మొనగాడికే పూలవింటి వాడే పులకించే మగవాడులే ఇలలో ఎవరు సాటి మా ఇంటికి ఇతనే పోటీ తన సరసం చెలి విరసం వలపుల భేటీ చామంతి పువ్వు సందెపొద్దువేళ చీరకట్టి ఆడెనులే చీమదొర లాంటి మామ రాక చూసి సిగ్గుమాలలేసెనులే అందమైన జంట వంద ఏళ్లపంట ఇల్లు దిద్దుకుంటు చల్లగుండ మంటా రేపు మాపు రెండు బండ్లుగా వర్ధిల్లండి మీరు చల్లగా చామంతి పువ్వు సందెపొద్దువేళ చీరకట్టి ఆడెనులే చీమదొర లాంటి మామ రాక చూసి సిగ్గుమాలలేసెనులే
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Chamanthi
See AllChakkani Chikkani
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Ide Rajayogam
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Kadale Neeku
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Kadali Meda Ontariga
S.P. Balasubrahmanyam, T. Srinivas
Nee Katha Needile
S.P. Balasubrahmanyam
Paala Ponge
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Vanjaram Vachindi
Malaysia Vasudevan