Song Details
Lyrics
ఎవ్వరో... ఎవ్వరో... నను తియ్యని గొంతుతొ పిలిచిందెవ్వరో ఎవ్వరో... ఎవ్వరో... తన మాటల తేనెలు పంచిందెవ్వరో మనసుకిది కానుకరో ఇచ్చినది ఎవ్వరో తనది ఏ పోలికరో పోల్చునది ఎవ్వరో చిలిపి సిరి మువ్వరో కలిపి తను ఎవ్వరో ఏమో ఏమో... నా గుండెతొ గుసగుసలాడిందెవ్వరో హే... ఆ ముసి ముసి నవ్వుల రూపం ఎవ్వరో ఎవ్వరో... ఎవ్వరో... ఈ దాగుడు మూతలు ఆడేదెవ్వరో హే హే... ఇంతలా ఏమార్చినా ఊరూ పేరూ జారవే నిన్నిలా నే మరచినా నువు మాత్రం నను వీడవే అందగాణ్ణి అంటావే మరి అందకుండ ఉంటావే హే ఆ ప్రాణ వాయువల్లే నువుకూడ కానరావే ఇంతిలా నన్ను ఊరిస్తావే నువ్వెంత అందానివే ఆ అందం కళ్ళకు కట్టేదెవ్వరో తన చిరునామా చూపెట్టేదెవ్వరో ఏ ఏ... నీ స్వరం వినాలనే కోరిక కలిగిస్తావులే తక్షణం నీవెవ్వరో తెలియదు అనిపిస్తావులే నన్ను నువ్వు చూస్తావే మరి నిన్ను నువ్వు దాస్తావే హే... అరె నిన్ను చూడాలని మైమరచి పోవాలని నా ఒళ్ళే కళ్ళై వలేస్తున్నా ఆచూకి చిక్కవులే ఆ చిక్కని నవ్వుల చక్కనిదెవ్వరో ఆ చక్కెర పలుకుల టక్కరి ఎవ్వరో ఎవ్వరో... ఎవ్వరో.... అరె ఇందరిలో ఆ సుందరి ఎవ్వరో
Lyrics sourced from public databases. May contain errors.