Song Details
Lyrics
వంద దేవుళ్ళే కలిసొచ్చినా అమ్మ నీలాగ చూడలేరమ్మా కోట్ల సంపదే అందించినా నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా నా రక్తమే ఎంతిచ్చినా నీ త్యాగాలనే మించునా నీ రుణమే తీర్చాలంటే ఒక జన్మయిన సరిపోదమ్మా నడిచేటి కోవెల నీవేలే... వంద దేవుళ్ళే కలిసొచ్చినా అమ్మ నీలాగ చూడలేరమ్మా కోట్ల సంపదే అందించినా నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా పగలైన రాత్రయినా జాగారాలు పిల్లల సుఖమే మెడ హారాలు పగలైన రాత్రయినా జాగారాలు పిల్లల సుఖమే మెడ హారాలు దీపముల కాలి వెలుగే పంచేను పసి నవ్వులే చూసి బాధే మరిచేను నడిచేటి కోవెల అమ్మేలే వంద దేవుళ్ళే కలిసొచ్చినా అమ్మా నీలాగ చూడలేరమ్మా కోట్ల సంపదే అందించినా నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా నా రక్తమే ఎంతిచ్చినా నీ త్యాగాలనే మించునా నీ రుణమే తీర్చాలంటే ఒక జన్మయిన సరిపోదమ్మా నడిచేటి కోవెల నీవేలే
Lyrics sourced from public databases. May contain errors.