MovieGQ

Muddu Mudduga

Bhale Bullodu (1995) · Track 3 of 6 · 4:20

Song Details

Lyrics

ముద్దు ముద్దుగా ముత్యాల వాన జల్లు కురవని మెత్త మెత్తగా వయ్యారమంత తడిమి చూడని కనుచూపులే కొంటె మెరుపులై కవ్వింతలే కన్నె ఉరుములై కలిపింది వాన కౌగిళ్ళలో ముద్దు ముద్దుగా ముత్యాల వాన జల్లు కురవని మెత్త మెత్తగా వయ్యారమంత తడిమి చూడని కొత్త కొత్త కోరికా కొంగే దాటు వేళలో వెన్నపూస లాంటి ఒళ్ళు నిన్నే కోరుతున్నది వెచ్చనైన ఊహలో ఒల్లే తుల్లే హాయిలో రెచ్చిపోయి కోడె ఈడు నిన్నే తరుముతున్నది కట్టాలి జట్టు పట్టాలి పట్టు కమ్మంగ వాన జోరులో పట్టేనే గుట్టు ఉయ్యాల కట్టు అందాల పూల దీవిలో మెరుపే మైమరుపై నీ ఒడిలో దాగే వేళా ఆఁ ముద్దు ముద్దుగా ముత్యాల వాన జల్లు కురవని ఆఁ... మెత్త మెత్తగా వయ్యారమంత తడిమి చూడని అగమంటే ఆగదు అశే నన్ను వీడదు చిన్నదాని చీర బెంగ తీర్చేదాక వదలదు తాళలేడు తుంటరి మాటే వినడు పోకిరి తెల్లవారిపోయేదాక ఆపేదెట్టా అల్లరి చిక్కావే బొమ్మ దానిమ్మ రెమ్మా చిత్రాలు చేసే వానలో ఆడించకమ్మా అంటితే కొమ్మ మత్తెక్కిపోయే మలుపులో వయసే వెల్లువగా కమ్ముకొనే కోలాటంలో ఆఁ ముద్దు ముద్దుగా ముత్యాల వాన జల్లు కురవని హోయ్ మెత్త మెత్తగా వయ్యారమంత తడిమి చూడని కను చూపులే కొంటె మెరుపులై కవ్వింతలే కన్నె ఉరుములై కలిపింది వాన కౌగిళ్ళలో

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Bhale Bullodu

See All