Song Details
Lyrics
ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు చెలియా గుండె తాకలేక పలకనందే నా మౌనం చెలిమి వెంట సాగలేక శిల అయిందే నా ప్రాణం గతమే మరిచి బ్రతకాలే మనసా ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు ఎగసి పడే అల కోసం దిగి వస్తుందా ఆకాశం తపనపడి ఏం లాభం అందని జాబిలి జత కోసం కలిసి ఉన్న కొంతకాలం వెనక జన్మ వరమనుకో కలిసి రాని ప్రేమ తీరం తీరిపోయిన రుణమనుకో మిగిలే స్మృతులే వరమనుకో మనసా మనసా ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు తన ఒడిలో పొదువుకుని భద్రంగా నడిపే నౌక తననొదిలి వెళ్ళకని ఏ బంధాన్ని కోరదుగా కడలిలోనే ఆగుతుందా కదలనంటు ఈ పయనం వెలుగువైపు చూడనందా నిదరలేచే నా నయనం కరిగే కలలే తరిమే మనసా మనసా ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు
Lyrics sourced from public databases. May contain errors.