MovieGQ

Oohalu Gusa Gusalade

Bandhipotu (1963) · Track 6 of 7

Song Details

Music Director
Lyricist

Lyrics

ఊహలు గుస గుసలాడే నా హృదయము ఊగిసలాడే ప్రియా... ఉఁ... ఊహలు గుస గుసలాడే నా హృదయము ఊగిసలాడే వలదన్న వినదీ మనసు కలనైనా నిన్నే తలచు (2) తొలి ప్రేమలో బలముుందిలే అది నీకు మునుపే తెలుసు ఊహలు గుస గుసలాడే నా హృదయము ఊగిసలాడే నను కోరి చేరిన బేల దూరాన నిలిచే వేళ (2) నీ ఆనతి లేకున్నచో విడలేను ఊపిరి కూడా ఊహలు గుస గుసలాడే నా హృదయము ఊగిసలాడే దివి మల్లే పందిరి వేసే భువి పెళ్ళి పీటను వేసే (2) మెర వెన్నెల కురిపించుచు నెలరాజు పెండ్లిని చేసే ఊహలు గుస గుసలాడే మన హృదయములూయలులూగే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Bandhipotu

See All