Song Details
Lyrics
పల్లవి: చందమామ రావే.. జాబిల్లి రావే అమ్మాయి అలిగింది.. అలక తీర్చిపోవే.. అలక తీర్చిపోవే చందమామ రావే.. జాబిల్లి రావే అబ్బాయి నోటికి.. తాళమేసి పోవే.. తాళమేసి పోవే చందమామ రావే చరణం: 1 చల్ల గాలి ఝడిపిస్తోంది.. ఎలాగా ? గళ్ళ దుప్పటి కప్పుకోండి.. ఇలాగా.. పండు వెన్నెల రమ్మంటో౦ది.. ఎలాగా? తలుపు తీశా వెళ్లిరండి.. ఇలాగా.. అందాల ఈ రేయీ వెళతాను అంటో౦ది ఇద్దరిని ఒక్కటిగ చూడాలి అంటో౦ది ఏదో వంకతో ఎందుకు పిలవాలి? .. కావాలంటే సూటిగానే అడగలేరా చందమామ రావే.. చరణం: 2 అమ్మాయి పుడితేను.. ఎలాగా? పెళ్లి చేసి పంపాలి.. ఇలాగా అబ్బాయి పుడితేను.. ఎలాగా? గొప్పవాణ్ణి చెయ్యాలి.. ఇలాగా అమ్మాయి పుట్టినా.. అబ్బాయి పుట్ట్టినా మీలాగే ఉండాలి.. మీ మనసే రావాలి తల్లే పాలతో మంచిని పోయాలి ఆ మంచితోనే వారు మనకు పేరు తేవాలి చందమామ రావే.. జాబిల్లి రావే పాపాయి పుడితేను.. జోల పాడరావే.. జోల పాడరావే.. చందమామ రావే
Lyrics sourced from public databases. May contain errors.