Ayya Baboi
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- S.P. Balasubrahmanyam
Lyrics
- పల్లవి:
అయ్య బాబోయ్...
అయ్య బాబోయ్ అదిరిపోయింది... అయ్య బాబోయ్ అదిరిపోయింది
ఆడపిల్లతో ఇలాగేనా ఆటలాడేది చెలగాటమాడేది?
అమ్మబాబోయ్..అదురుపుట్టింది.. అమ్మబాబోయ్ అదురుపుట్టింది
హద్దుమీరితే ఆడదాన్ని ఏమి చేసేది.. ఇంతకన్న ఏమిచేసేది?
చరణం: 1
కొలతలన్నీ తెలిసినవాడా... కొత కోసి కుట్టేవాడా.. బాబోయ్...
కొలతలన్నీ తెలిసినవాడా... కొత కోసి కుట్టేవాడా..
కుర్రదాని కోర్కెలన్నీ కొలిచి చూస్తావా.. గుండె కోస్తావా?
షోకులమ్మె షాపులోన ఫోజులిచ్చే పిల్లదానా
గాజు బొమ్మకు చీర కడితే..
గాజు బొమ్మకు చీర కడితే.. మోజు పుడుతుందా? ముద్దు వస్తుందా?
అయ్య బాబోయ్ అదిరిపోయింది... అమ్మబాబోయ్ అదురుపుట్టింది
చరణం: 2
నడుము చూడు ఇరవై అయిదే... ఛాతీ కొలత ముప్పై అయిదు
రెండు కలిపి లెక్క వేసి మనసు లొతెంతో తెలుసుకుంటావా?
చూపుతోనే లెక్కగట్టి వయసు ఎంతో చెప్పగలను..
మనసు లోతు చెప్పజాలనీ..
మనసు లోతు చెప్పజాలనీ... మనిషినేనమ్మా.. మరిచిపోవమ్మా
అయ్య బాబోయ్ అదిరిపోయింది.. అమ్మబాబోయ్ అదురుపుట్టింది
హద్దుమీరితే ఆడదాన్ని ఏమి చేసేది? ఇంతకన్న ఏమిచేసేది?
Babu
Movie More SongsAyya Baboi Keyword Tags
-
-