Song Details
Lyrics
హల్లో అంటూ పిలిచి కల్లోలం కలిగించి ఇల్లా రప్పించావే నన్నాకర్షించి అందుకు నీదే పూచి - ఎందుకు నీతో పేచి ఇచ్చేదేదో ఇచ్చి - వచ్చెయ్ నాతో రాజీ కోలకంటి చూపా కొత్త ఏటి చేపా పూలవింటి తూపా తాళవా ప్రతాపా హ బెదరకే పాపా - వదలని కైపా నువు కనపడి కలవరపడి తెగ ఎగసిన మగ మనసిది వాలిందే నీపై ఎగిరొచ్చి నేనేగా ఆపా ఎదురొచ్చి - కీడెంచి మేలెంచి హల్లో అంటూ పిలిచి కల్లోలం కలిగించి ఇల్లా రప్పించావే నన్నాకర్షించి చరణం: 1 ఆరాతీసేవాళ్ళు పారా కాసేవాళ్ళూ దారంతా ఉంటారు ఔరా జాగ్రత్త ఎందరినేమారుస్తాం - ఇంద్రజాలం చేస్తాం తిమ్మిని బమ్మిని చేద్దాం - మన్మథ మంత్రం వేద్దాం రేయిలాంటి మైకం కప్పుకొని ఉందాం మాయదారి లోకం కంట పడదందాం మన ఏకాంతం - మనకే సొంతం అష్ట దిక్కులన్ని దుష్ట శక్తులల్లే కట్టకట్టుకొచ్చి చుట్టుముట్టుకుంటే యుద్ధానికి సిద్ధం అనుకుందాం పద్నాలుగు లోకాలను మొత్తం - ముద్దుల్లో ముంచేద్దాం ఆరాతీసేవాళ్ళు పారా కాసేవాళ్ళూ దారంతా ఉంటారు ఔరా జాగ్రత్త చరణం: 2 పిల్లకి మెళ్ళో పుస్తే కట్టేదెప్పుడంట పిల్లికి మెళ్ళొ గంట కట్టేదెవరంట చప్పున చెప్పవె చిట్టీ - చంపకు ఊదరగొట్టి దగ్గిర దగ్గిర ఉండి - తగ్గదు బాదర బంది ఆవురావురందీ ఆకలాగనంది ఆవిరెక్కువుంది అంటుకోకు అందీ హ తట్టుకోడమెల్లా - ముట్టుకుంటే డిల్లా విస్తరాకు నిండ విస్తరించి ఉన్న విందు చూసి కూడా పస్తులుండమని ఎవ్వరిది శాసించిన పాపం ఎవ్వరిపై చూపిస్తాం కోపం - అయినా పెడతా శాపం హల్లో అంటూ పిలిచి కల్లోలం కలిగించి ఇల్లా రప్పించావే నన్నాకర్షించి అందుకు నీదే పూచి - ఎందుకు నీతో పేచి ఇచ్చేదేదో ఇచ్చి - వచ్చెయ్ నాతో రాజీ కోలకంటి చూపా కొత్త ఏటి చేపా పూలవింటి తూపా తాళవా ప్రతాపా హ బెదరకే పాపా - వదలని కైపా నువు కనపడి కలవరపడి తెగ ఎగసిన మగ మనసిది వాలిందే నీపై ఎగిరొచ్చి నేనేగా ఆపా ఎదురొచ్చి - కీడెంచి మేలెంచి హల్లో అంటూ పిలిచి కల్లోలం కలిగించి ఇల్లా రప్పించావే నన్నాకర్షించి
Lyrics sourced from public databases. May contain errors.