Choosuko Padhilanga
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా
పగిలేది ఖాయం ఏదైనా రగిలేను నీలో వేదన
చూసుకో పదిలంగా..
వికసించే పూలు ముళ్ళూ విధిరాతకు ఆనవాళ్ళు
వికసించే పూలు ముళ్ళూ విధిరాతకు ఆనవాళ్ళు
ఒకరికంట పన్నీరైనా ఒకరికంట కన్నీళ్ళు
ఒకరికంట పన్నీరైనా ఒకరికంట కన్నీళ్ళు
ఎండమావి నీరు తాగి గుండెమంటలార్చుకోకు
ఎండమావి నీరు తాగి గుండెమంటలార్చుకోకు
ఆశ పెంచుకోకు నేస్తం అది నిరాశ స్వాగత హస్తం
కాలమనే నదిలో కదిలే ఖర్మమనే నావమీద
కాలమనే నదిలో కదిలే ఖర్మమనే నావమీద
ఎవరి తోడు ఎన్నాళ్ళున్నా చివరి తోడు నువ్వేలే
ఎవరి తోడు ఎన్నాళ్ళున్నా చివరి తోడు నువ్వేలే
సాగుతున్న బాటసారి ఆగిచూడు ఒక్కసారి
సాగుతున్న బాటసారి ఆగిచూడు ఒక్కసారి
కలుసుకోని ఇరు తీరాలు కనిపించని సుడిగుండాలు
చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా
పగిలేది ఖాయం ఏదైనా రగిలేను నీలో వేదన
చూసుకో పదిలంగా
- చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా
Anuraga Devatha
Movie More SongsChoosuko Padhilanga Keyword Tags
-
-
-