Song Details
Lyrics
పల్లవి: సమూహ భోజనంబు.. సంతోషమైన విందు.. అంతస్తులన్ని బందు.. అహహ్హ ఏమనందు సమూహ భోజనంబు.. సంతోషమైన విందు.. అంతస్తులన్ని బందు.. అహహ్హ ఏమనందు చరణం: 1 గోదారి గంగ నీరు తాగేరు కలిసి మీరు.. అంగట్లో అమ్ము బియ్యం కోంటారు కలిసి మీరు గోదారి గంగ నీరు తాగేరు కలిసి మీరు.. అంగట్లో అమ్ము బియ్యం కోంటారు కలిసి మీరు ఆ నీటితోనె బియ్యం వండగనె వచ్చు కయ్యం.. ఆ నీటితోనె బియ్యం వండగనె వచ్చు కయ్యం అబ్బా ఇదేమి న్యాయం బహు చెడ్డ సాంప్రదాయం.. అబ్బా ఇదేమి న్యాయం బహు చెడ్డ సాంప్రదాయం ఈ గొణుగుచున్న ఘనులు.. కడు మూర్ఖ శిఖామణులు సమూహ భోజనంబు... సంతోషమైన విందు అంతస్తులన్ని బందు... అహహ్హ ఏమనందు చరణం: 2 అరె..హ ! ఆస్పత్రి మందులందు అంటేమి కానబడదు... ఇస్కూల్లొ చదువునపుడు పుస్తకము మైలబడదు ఆస్పత్రి మందులందు అంటేమి కానబడదు... ఇస్కూల్లొ చదువునపుడు పుస్తకము మైలబడదు కాదప్ప అల్లాటప్ప ఇహ చెల్లదు మీ గొప్ప.. కాదప్ప అల్లాటప్ప ఇహ చెల్లదు మీ గొప్ప కాలమ్ము మారెనప్పా ఓ వెర్రివెంగళప్పా.. ఆలోచనలను పెంచు.. ఆవేశములను దించు సమూహ భోజనంబు... సంతోషమైన విందు అంతస్తులన్ని బందు... అహహ్హ ఏమనందు చరణం: 3 దేవుడికి మొక్కునపుడు హోటల్లో మెక్కినపుడు.. రైళ్ళల్లో ఎక్కునపుడు బస్సుల్లో చిక్కినపుడు దేవుడికి మొక్కునపుడు హోటల్లో మెక్కినపుడు.. రైళ్ళల్లో ఎక్కునపుడు బస్సుల్లో చిక్కినపుడు హెచ్చన్న మాటరాదు తగ్గన్న మాట లేదు.. హెచ్చన్న మాటరాదు తగ్గన్న మాటలేదు సహపంక్తి భోజనాన కొంపేమి మునిగిపోదు.. సహపంక్తి భోజనాన కొంపేమి మునిగిపోదు కోపాలు సర్దుకోండి... సాపాటు పంచుకోండి సమూహ భోజనంబు.. సంతోషమైన విందు అంతస్తులన్ని బందు... అహహ్హ ఏమనందు సమూహ భోజనంబు.. సంతోషమైన విందు అంతస్తులన్ని బందు... అహహ్హ ఏమనందు
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Andhala Ramudu
See AllMamu Brovamani Cheppave
V. Ramakrishna
Suddhabrahma (Slokam)
V. Ramakrishna
Paluke Bangaramayera
J.V. Raghavulu, Madhavapeddi Satyam, M. Balamuralikrishna
Yedavaku Yedavaku Verrinaganna
V. Ramakrishna
Chakirevu Bana Yemandhi
V. Ramakrishna, J.V. Raghavulu, Vijayalakshmi Khannarao
Ramudemannadoi
V. Ramakrishna
Maa Thalli Godari
V. Ramakrishna, J.V. Raghavulu
Bhajanachese Vidhamu Theliyandi
Vijayalakshmi Khannarao, V. Ramakrishna
Kurise Vennello Merise Godarila
V. Ramakrishna, P. Susheela
Abbosi Chinnamma
V. Ramakrishna, P. Susheela
Adhigo Badradri Gowthami
-
Vaamaanka Sthitha (Slokam)
M. Balamuralikrishna