Kadasari Veedkolu
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- S.P. BalasubrahmanyamBalaramFebi
Lyrics
- పల్లవి:
కడసారిది వీడ్కోలు కన్నీటితో మా చేవ్రాలు
అడవి చెట్లను పావురాళ్ళను కలలోనైనా కనగలమా
ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ
ప్రాణాలే విడిచి సాగే పయనమిది ఓ...ఓ..
కడసారిది వీడ్కోలు కన్నీటితో మా చేవ్రాలు
అడవి చెట్లను పావురాళ్ళను కలలోనైనా కనగలమా
ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ
ప్రాణాలే విడిచి సాగే పయనమిది ఓ...ఓ..
చరణం: 1
తల్లి నేలని పల్లె సీమని విడ తరమా తరమా
తల్లి నేలని పల్లె సీమని విడతరమా తరమా
ఉన్న ఊరిలో ఉన్న సౌఖ్యము స్వర్గమివ్వగలదా గలదా
జననానికి ఇది మా దేశం మరణానికి మరి ఏ దేశం
జననానికి ఇది మా దేశం మరణానికి మరి ఏ దేశం
కదిలే నదులారా కలలే అలలౌనా
జననీ... జన్మ భూమి స్వర్గాదపి గరీయసి
కన్నీటి తెరలలో తల్లి నేలని
కడసారి పేగు కనలేక కదిలిపోయెనో
కడసారిది వీడ్కోలు కన్నీటితో మా చేవ్రాలు
అడవి చెట్లను పావురాళ్ళను కలలోనైనా కనగలమా
ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ
ప్రాణాలే విడిచి సాగే పయనమిది ఓ...ఓ..
చరణం: 2
పాడే జోలలు పాపల ఏడ్పుల పాలైపోతే
పాడే జోలలు పాపల ఏడ్పుల పాలైపోతే
ఉదయ సూర్యుడే విలయ ధూమపు తెరలో దాగే
పూల డోల నిన్నటి నిదర ముళ్ళు కదా ఇప్పటి నడక
ఉసురు మిగిలుంటే మరలా దరిచేరవా
మనసే.. మిగిలుంటే ఒడిలో తలదాచవా
తలపే అల్పం తపనే అధికం
బరువెక్కిన హృదయం మోసుకునే పోతున్నా...
కడసారిది వీడ్కోలు కన్నీటితో మా చేవ్రాలు
అడవి చెట్లను పావురాళ్ళను కలలోనైనా కనగలమా
ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ
ప్రాణాలే విడిచి సాగే పయనమిది ఓ...ఓ..
Amrutha
Movie More SongsKadasari Veedkolu Keyword Tags
-
-