Song Details
Lyrics
పల్లవి: ఎవరు రాయగలరు... అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు... అమ్మా అను రాగం కన్న తియ్యని రాగం అమ్మేగా... అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మా అను రాగం కన్న తియ్యని రాగం చరణం: 1 అవతారమూర్తి అయినా అణువంతే పుడతాడు అమ్మపేగు పంచుకునే అంతవాడు అవుతాడు అవతారమూర్థైనా అణువంతే పుడతాడు అమ్మపేగు పంచుకునే అంతవాడు అవుతాడు అమ్మేగా... అమ్మేగా చిరునామా ఎంతటి ఘనచరితకి అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మా అను రాగం కన్న తియ్యని రాగం చరణం: 2 శ్రీరామరక్ష అంటూ... నీళ్ళుపోసి పెంచింది ధీర్గాయురస్తు అంటూ... నిత్యం దీవించింది శ్రీరామరక్ష అంటూ నీళ్ళుపోసి పెంచింది ధీర్గాయురస్తు అంటూ నిత్యం దీవించింది నూరేళ్ళు... నూరేళ్ళు ఎదిగి బ్రతుకు అమ్మ చేతి నీళ్ళతో నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మచేతి వేళ్ళతో ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మా అను రాగం కన్న తియ్యని రాగం అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మా అను రాగం కన్న తియ్యని రాగం
Lyrics sourced from public databases. May contain errors.