Maa Amma Deevena 2
Song
Movie
-
Music Director
-
Singers
- S.P. Balasubrahmanyam
Lyrics
- భారతాన్ని రాశాడు వ్యాదవ్యాసుడు
భాగవతం రాశాడు పోతనామాత్యుడు
రామాయణం ఒక్కడు బైబిలేమొ ఒక్కడు
ఖురాన్ ఇంకొక్కడు రాసి పారేశారు
ఒక్కడైన ఎక్కడైనా రాశాడా పేదవాడి కథ ఏమిటో
ఎవ్వడైనా ఎప్పుడైనా చెప్పాడా తల్లిదండ్రి బ్రతుకేమిటో
చెప్పండి
భారతాన్ని రాశాడు వ్యాదవ్యాసుడు
భాగవతం రాశాడు పోతనామాత్యుడు
నిన్ను నన్ను పుట్టించిన బ్రహ్మదేవుడూ
పుట్టింది నాభిలోన కలువపువ్వులో
ఆ దేవుడ్ని పుట్టించిన కలువ పువ్వు
పుట్టిందే ముక్కు పగులు బురద గుంటలో
తమ పుట్టుకే చెప్పుకోని గుంట నక్కలు
పుడతారు మారుజన్మన పిచ్చి కుక్కలై
పుడతారు మారుజన్మన పిచ్చి కుక్కలై
పాలు తాగి పాము విషం కక్కితే
మందుతాగి నేను నిజం కక్కుతా
భారతాన్ని రాశాడు వ్యాదవ్యాసుడు
భాగవతం రాశాడు పోతనామాత్యుడు
పాపపుణ్యమెరుగని తల్లిదండ్రులు
కంటారు బిడ్డల్ని గంపెడాశతో
తమ కడుపులు కట్టుకొని పిచ్చి తల్లులూ
మేపుతారు బిడ్డల్ని పిచ్చి ప్రేమతో
వదిగి వదిగి ఎదిగిపోయి ఎర్రి కొడుకులు
గుచ్చుతారు గుణపాలు కన్నకడుపులో
వదిగి వదిగి ఎదిగిపోయి ఎర్రి కొడుకులు
గుచ్చుతారు గుణపాలు కన్నకడుపులో
పాలు తాగి పాము విషం కక్కితే
మందుతాగి నేను నిజం కక్కుతా
భారతాన్ని రాశాడు వ్యాదవ్యాసుడు
భాగవతం రాశాడు పోతనామాత్యుడు
రామాయణం ఒక్కడు బైబిలేమొ ఒక్కడు
ఖురాన్ ఇంకొక్కడు రాసి పారేశారు
ఒక్కడైన ఎక్కడైనా రాశాడా పేదవాడి కథ ఏమిటో
ఎవ్వడైనా ఎప్పుడైనా చెప్పాడా తల్లిదండ్రి బ్రతుకేమిటో
భారతాన్ని రాశాడు వ్యాదవ్యాసుడు
భాగవతం రాశాడు పోతనామాత్యుడు
Amma Kadupu Challaga
Movie More SongsMaa Amma Deevena 2 Keyword Tags
-


