MovieGQ

Edho Manasu

Amma Donga (1995) · Track 6 of 6

Song Details

Lyrics

ఏదో మనసు పడ్డాను గాని కల్లో కలుసుకున్నాను గాని నీపై ప్రేమో ఏమో నాలో ఏదో మనసు పడ్డాను గాని ఎంతో అలుసు అయ్యాను గాని నాపై ప్రేమో ఏమో బోలో రావా పడుచు మది తెకుసుకొనలేవా తపన పడు తనువు ముడి మనువై మమతై మనదై పోయే అనురాగాల ఫలమై ఏదో మనసు పడ్డాను గాని కల్లో కలుసుకున్నాను గాని నీపై ప్రేమో ఏమో నాలో ఒక హృదయం పలికినది జతకోరే జతులు శృతులు కలిపి ఒక పరువం పిలిచినది ప్రేమించి ఒక అందం మెరిసినది ఎదలోన చిలిపి వలపు చిలికి ఒక బంధం బిగిసినది వేధించి తెలుసా ఏటి మనసా పూల వయసేమంటుందో తెలిసి చంటి మనసే కంటి నలుసై పోతుందో ఓ భామా రమ్మంటే ఈ ప్రేమ బాధే సరి మెడవిరి గడుసరి సరి సరిలే ఏదో మనసు పడ్డాను గాని ఎంతో అలుసు అయ్యాను గాని నాపై ప్రేమో ఏమో బోలో ఒక మురిపం ముదిరినది మొగమాటం మరిచి ఎదుట నిలిచి ఒక అధరం వనికినది ఆశించి ఒక మౌనం తెలిసినది నిదురించే కలలు కనుల నిలిపి ఒక రూపం అలిగినది వాదించి బహుశా భావసరసాలన్ని విరసాలౌను ఏమో ఇక సాగించు జత సాదించు మనసే ఉన్నదేమో ఓ పాపా నిందిస్తే ఆ పాపం నాదే మరి విధి మరి విషమని మరి తెలిసే ఏదో మనసు పడ్డాను గాని కల్లో కలుసుకున్నాను గాని నీపై ప్రేమో ఏమో నాలో ఏదో మనసు పడ్డాను గాని ఎంతో అలుసు అయ్యాను గాని నాపై ప్రేమో ఏమో బోలో రావా పడుచు మది తెకుసుకొనలేవా తపన పడు తనువు ముడి మనువై మమతై మనదై పోయే అనురాగాల ఫలమే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Amma Donga

See All