Song Details
Lyrics
పల్లవి : మనిషైతే.. మనసుంటే మనిషైతే మనసుంటే.. కనులు కరగాలిరా కరిగి కరుణ కురియాలిరా.. కురిసి జగతి నిండాలిరా చరణం: 1 ఆగి ఆగి సాగి పోరా.. సాగి పోతూ చూడరా..ఆ.. ఆగి ఆగి సాగి పోరా.. సాగి పోతూ చూడరా..ఆ.. వేగి పోయే ఎన్నెన్నెని బ్రతుకులో.. వేడుకుంటూ ఎన్నెన్ని చేతులో వేచి ఉన్నాయిరా.. మనిషైతే.. మనసుంటే మనిషైతే మనసుంటే.. కనులు కరగాలిరా కరిగి కరుణ కురియాలిరా.. కురిసి జగతి నిండాలిరా చరణం: 2 తేలిపోతూ నీలి మేఘం.. జాలి జాలిగ కరిగేరా తేలిపోతూ నీలి మేఘం.. జాలి జాలిగ కరిగేరా కేలు చాపి ఆ దైవమే తన.. కేలు చాపి ఆకాశమే ఈ.. నేల పై ఒరిగెరా.. మనిషైతే.. మనసుంటే.. మనసుంటే మన్షైతే.. వైకుంఠమే ఒరుగురా నీ కోసమే కరుగురా.. నీ కోసమే కరుగురా.. నీ కోసమే కరుగురా..
Lyrics sourced from public databases. May contain errors.