Song Details
Lyrics
పల్లవి: చందమామ రమ్మంది చూడు.. చల్లగాలి రమ్మంది చూడూ.. ఆ పైన.. ఇంక ఆ పైన.. నువ్వు నా కళ్ళలో తొంగి చూడూ చందమామ బాగుంది నేడు.. చల్లగాలి బాగుంది నేడు ఏముంది.. ఇంక ఏముంది.. అది అంతే కదా ఏనాడు చందమామ బాగుంది నేడు చరణం: 1 పూవులే ఎందుకో నవ్వుతున్నాయి చూడు పూవులే ఎందుకో నవ్వుతున్నాయి చూడు వెన్నెలే ఎందుకో నన్ను కవ్వించే నేడు తెలుసుకోలేవు నీవూ.. పలకగాలేను నేను చందమామ రమ్మంది చూడూ చరణం: 2 పూవులే నవ్వితే నవ్వుకోనిమ్ము నేడు పూవులే నవ్వితే నవ్వుకోనిమ్ము నేడు ఉందిగా వెన్నెలా ఎందుకమ్మాయి తోడు నీది నా దారి కాదు.. నాది నీ దారి కాదు చందమామ బాగుంది నేడు చరణం: 3 చెంతగా నిలిచినా ఇంత గిలిగింత లేదు చెంతగా నిలిచినా ఇంత గిలిగింత లేదు చెంతగా నిలిచినా వింత నాకేమి లేదు అడవి మనిషివి నీవు.. ఆ మాటే తగదన్నాను చందమామ రమ్మంది చూడు.. చల్లగాలి రమ్మంది చూడు ఆ పైన.. ఇంక ఆ పైన.. నువ్వు నా కళ్ళలో తొంగి చూడు చందమామ రమ్మంది చూడు
Lyrics sourced from public databases. May contain errors.