Mallelu Kurisina Challani Velalo
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- Ghantasala
Lyrics
- మల్లెలు కురిసిన చల్లని వేళలో
మనసే పలికెను నేడేలనో... ఎలానో
మల్లెలు కురిసిన చల్లని వేళలో
మనసే పలికెను నేడేలనో... ఎలానో
మల్లెలు కురిసిన చల్లని వేళలో
మనసే పలికెను నేడేలనో... ఎలానో
చరణం: 1
చలిచలి గాలులు చిలిపిగ వీచే....జిలిబిలి తలపులు చిగురులు వేసే
తొలకరి వయసే తొందర చేసే
యవ్వనమేమో సవ్వడి చేసే....యవ్వనమేమో సవ్వడి చేసే....
సవ్వడి చేసే
మల్లెలు కురిసిన చల్లని వేళలో
మనసే పలికెను నేడేలనో... ఎలానో
చరణం: 2
పిలువని కనులే పిలిచెను నన్నే...పలుకని జాబిలి వలచెను నన్నే ...
అందాలేవో అలలై ఆడే... అందని కౌగిళి అందెను నేడే..
అందని కౌగిళి అందెను నేడే .. అందెను నేడే !
మల్లెలు కురిసిన చల్లని వేళలో
మనసే పలికెను నేడేలనో... ఎలానో
చరణం: 3
సొగసులు విరిసే వెన్నెలలోన
ఎగిసే ఊహల పల్లకి పైన
నీవే నేనై పయనించేమా
నేనే నీవై పయనించేమా
జీవన రాగం పలికించేమా....జీవన రాగం పలికించేమా....
పలికించేమా
మల్లెలు కురిసిన చల్లని వేళలో
మనసే పలికెను నేడేలనో... ఎలానో
అహ...హ...అహ..హా...అహ...హ...అహ...హా...
Adugu Jaadalu
Movie More SongsMallelu Kurisina Challani Velalo Keyword Tags
-
-