MovieGQ

Urakalai Godavari

Abhilasha (1983) · Track 5 of 5 · 4:42

Song Details

Lyrics

ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి సొగసులై బృందావని విరిసె నా సిగలోనికి జత వెతుకు హృదయానికీ శృతి తెలిపె మురళీ చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళీ రసమయం జగతి ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి నీ ప్రణయభావం నా జీవ రాగం నీ ప్రణయభావం నా జీవ రాగం రాగాలు తెలిపే భావాలు నిజమైనవి లోకాలు మురిసే స్నేహాలు రుజువైనవి అనురాగ రాగాల స్వరలోకమె మనదైనది ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి జత వెతుకు హృదయానికీ శృతి తెలిపె మురళీ చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళీ రసమయం జగతి నా పేద హృదయం నీ ప్రేమ నిలయం నా పేద హృదయం నీ ప్రేమ నిలయం నాదైన బ్రతుకే ఏనాడో నీదైనది నీవన్న మనిషే ఈ నాడు నాదైనది ఒక గుండె అభిలాష పది మందికి బ్రతుకైనది ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి సొగసులై బృందావని విరిసె నా సిగలోనికి జత వెతుకు హృదయానికీ శృతి తెలిపె మురళీ చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళీ రసమయం జగతి బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Abhilasha

See All