Song Details
Lyrics
బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే మల్లీ మందారం పెళ్ళాడుకున్నాయిలే నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే తేనెవాగుల్లో మల్లె పూలల్లే తేలిపోదాములే గాలీవానల్లో మబ్బు జంటల్లే రేగిపోదాములే విసిరే కొసచూపే ముసురై పోతుంటే ముసిరే వయసుల్లో మతి అసలే పోతుంటే వేడెక్కి గుండెల్లో తలదాచుకో తాపాలలో ఉన్న తడి ఆర్చుకో ఆకాశమంటే ఎదలో జాబిల్లి నీవే వెన్నెల్లు తేవే బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే తారత్తా తరతత్ తరతా తారత్తా తరతత్ తరరా పూతపెదవుల్లో పుట్టు గోరింట బొట్టు పెట్టిందిలే ఎర్ర ఎర్రంగా కుర్ర బుగ్గల్లో సిగ్గు తీరిందిలే ఒదిగే మనసేదో ఒకటై పొమ్మంటే ఎదిగే వలపంతా ఎదలొకటై రమ్మంటే కాలాలు కరిగించు కౌగిళ్ళలో దీపాలు వెలిగించు నీ కళ్ళతో ఆ మాట వింటే కరిగే నా ప్రాణమంతా నీ సొంతమేలే బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే మల్లీ మందారం పెళ్ళాడుకున్నాయిలే నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
Lyrics sourced from public databases. May contain errors.