Okatai Podhama
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- S.P. Balasubrahmanyam
Videos
Lyrics
- ఒకటై పోదామా ఊహల వాహినిలో
మమతల తరగలపై..మధువుల నురగలపై..
పరవశమొందగా ఏకమౌదామా..
పరవశమొందగా ఏకమౌదామా..
ఓ ఓ ఓ.. అనురాగసీమలో..అందాలకోనలో..అల్లారు ముద్దుగా ఉందామా
సొంపైన పొదరింట..ఇంపైన గిలిగింత..
సొంపైన పొదరింట..ఇంపైన గిలిగింత..
దోబూచులాడుతూ..నవ్వుకుందామా..
ఒకటై పోదామా ఊహల వాహినిలో
మమతల తరగలపై..మధువుల నురగలపై..
పరవశమొందగా ఏకమౌదామా..
పరవశమొందగా ఏకమౌదామా..
చిగురాకు జంపాల.. చెలరేగు చెలువాల..ఊయ్యాలలూగుతూ ఉందామా
చిగురాకు జంపాల.. చెలరేగు చెలువాల..ఊయ్యాలలూగుతూ ఉందామా
నింగిలో విహరించి..నేలపై పులకించి
నింగిలో విహరించి..నేలపై పులకించి
శృంగార జలధిలో తేలుదామా..
ఒకటై పోదామా ఊహల వాహినిలో
మమతల తరగలపై..మధువుల నురగలపై..
పరవశమొందగా ఏకమౌదామా..
పరవశమొందగా ఏకమౌదామా..
ఓ ఓ ఓ..వలపుల జంటగా..సరదాల పంటగా..సయ్యాట పాటలై సాగుదామా
తారా చంద్రులమై.. రాధాకృష్ణులమై
తారా చంద్రులమై.. రాధాకృష్ణులమై
తన్మయమొందుతూ కరిగిపోదామా
ఒకటై పోదామా ఊహల వాహినిలో
మమతల తరగలపై..మధువుల నురగలపై..
పరవశమొందగా ఏకమౌదామా..
పరవశమొందగా ఏకమౌదామా..
Aasthulu Anthasthulu
Movie More SongsOkatai Podhama Keyword Tags
-
-





