MovieGQ

Choododde Nannu

Aaru (2005) · Track 1 of 7

Song Details

Singers
Music Director
Lyricist

Lyrics

చూడొద్దే నను చూడొద్దే చురకత్తిలాగ నను చూడొద్దే వెళ్ళోద్దె వదిలెళ్ళొద్దే మది గూడు దాటి వదిలెళ్ళోద్దే అప్పుడు పంచిన నీ మనసే అప్పని అనవద్దే ఇప్పుడు పెరిగిన వడ్డీతో ఇమ్మని అడగొద్దే చూడొద్దే నను చూడొద్దే చురకత్తిలాగ నను చూడొద్దే వెళ్ళోద్దె వదిలెళ్ళొద్దే మది గూడు దాటి వదిలెళ్ళోద్దే వద్దు వద్దంటు నేనున్నా వయసే గిల్లింది నువ్వేగా పో పో పొమ్మంటు నేనున్నా పొగలా అల్లింది నువ్వేగా నిదరోతున్న హృదయాన్ని లాగింది నువ్వేగా నలుపై ఉన్న రాతిరికి రంగులు నువ్వేగా నాతో నడిచే నా నీడ నీతో నడిపావే నాలో నిలిచే నా ప్రాణం నువ్వై నిలిచావే చూడొద్దే నను చూడొద్దే చురకత్తిలాగ నను చూడొద్దే వెళ్ళోద్దె వదిలెళ్ళొద్దే మది గూడు దాటి వదిలెళ్ళోద్దే హా ... హా... వద్దు వద్దంటు నువ్వున్నా వలపే పుట్టింది నీ పైనా కాదు కాదంటు నువ్వున్నా కడలి పొంగింది నాలోన కన్నీల్ల తీరంలో పడవల్లే నిలుచున్నా సుడిగుండాల శృతిలయలో పిలుపే ఇస్తున్నా మంటలు తగిలిన పుత్తడిలో మెరుపే కలుగునులే ఒంటిగా తిరిగిన ఇద్దరిలో ప్రేమే పెరుగునులే చూడొద్దు నను చూడొద్దు చురకత్తిలాగ నను చూడొద్దు వెళ్ళోద్దు వదిలెళ్ళొద్దు మది గూడు దాటి వదిలెళ్ళొద్దు అప్పుడు పంచిన నా మనసే అప్పని అనలేదే గుప్పెడు గుండెల చెలిఊసే ఎప్పుడు నీదేలే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Aaru

See All