Song Details
Lyrics
నేడే తెలిసింది ఈ నాడే తెలిసింది నేడే తెలిసింది ఈ నాడే తెలిసింది కమ్మనికళకే రూపంవస్తే కమ్మనికళకే రూపంవస్తే అది నీ లాగే ఉంటుందని నేడే తెలిసింది ఈ నాడే తెలిసింది ఓ... నేడే తెలిసింది ఈ నాడే తెలిసింది నేడే తెలిసింది ఈ నాడే తెలిసింది తియ్యని పాటకు ప్రాణం వస్తే తియ్యని పాటకు ప్రాణం వస్తే అది నీ లాగే ఉంటుందని నేడే తెలిసింది ఈ నాడే తెలిసింది ఇంత మంచి రూపానికి అంత మంచి మనసుంటుందనీ ఇంత మంచి రూపానికి అంత మంచి మనసుంటుందనీ ఆ మనసున అంతరాలకూ తావన్నది లేనేలేదనీ ఆ మనసున అంతరాలకూ తావన్నది లేనేలేదనీ అది వలచేదొకసారేనని ఆ వలపే విడిపోలేనిదని నేడే తెలిసింది ఈ నాడే తెలిసింది మారుమూల పల్లెలోనా మధురగానముదయించేనని మారుమూల పల్లెలోనా మధురగానముదయించేనని శిలలకైనా ఆ గానం పులకింతలు కలిగించేనని శిలలకైనా ఆ గానం పులకింతలు కలిగించేనని అది జతగా నను చేరాలని నా బ్రతుకే శృతి చేయాలని నేడే తెలిసింది ఈ నాడే తెలిసింది కమ్మని కళకే రూపం వస్తే అది నీ లాగే ఉంటుందని నేడే తెలిసింది ఈ నాడే తెలిసింది ఓ... తియ్యని పాటకు ప్రాణం వస్తే అది నీ లాగే ఉంటుందని నేడే తెలిసింది ఈ నాడే తెలిసింది నేడే తెలిసింది ఈ నాడే తెలిసింది
Lyrics sourced from public databases. May contain errors.