Song Details
Lyrics
పల్లవి: నీ రూపు మారింది గోపాలుడా.. లేని నాజూకు పెరిగింది నా రాముడా.. పూలఉయ్యాల ఊపాలా..ఓ బాలుడా..బాలుడా..గోపాలుడా.. హా..ఆ బాలుడా..గోపాలుడా.. హ్హా..హ్హా..హ్హా.. ఈ రాధ కన్నేస్తే గోపాలుడే..మరి ఈ సీత కరుణిస్తే శ్రీరాముడే.. వీడు..ఈనాడు..ఏనాడు..నీ బాలుడే.. బాలుడే..గోపాలుడే..బాలుడే..గోపాలుడే.. చరణం: 1 మెరిసే నీ కళ్ళలోనా..గండు మీనై నేనీది రానా..ఆ..ఆ వలపే నీ గుండెలోనా..మురళి పిలుపై నే ఊగిపోనా.. మెరిసే నీ కళ్ళలోనా..గండు మీన నేనీది రానా..ఆ..ఆ ఓ..ఓ..వలపే నీ గుండె లోనా..మురళి పిలుపై నే ఊగిపోనా.. నీ కమ్మని పెదవి పిల్లనగ్రోవి కావాలంటనా.. అది ఊదుతుంటే ఒళ్ళే మరచి ఊగుతుంటాను ఆహ.. నీ రూపు మారింది గోపాలుడా.. లేని నాజూకు పెరిగింది నా రాముడా.. వీడు..ఈనాడు..ఏనాడు..నీ బాలుడే.. బాలుడే..గోపాలుడే..బాలుడే..గోపాలుడే.. చరణం: 2 ఎదురుగ నీవుండిపోతే..జీవనదిలా ఉప్పొంగిపోనా.. నదిలా ఉప్పొంగిపోతే..నిన్ను ఎదలో నేదాచుకోనా..ఆ ఎదురుగ నీవుండిపోతే..జీవనదిలా ఉప్పొంగిపోనా.. ఆ..ఆ..నదిలా ఉప్పొంగిపోతే..నిన్ను ఎదలో నేదాచుకోనా..ఆ హద్దులు దాటి..మబ్బులు మీటి..ఆడుకుందామా... ముద్దులతోనే..మిద్దెలు కట్టి ముచ్చటగుందామా... ఆహ..నీ రూపు మారింది గోపాలుడా.. లేని నాజూకు పెరిగింది నా రాముడా.. పూలఉయ్యాల ఊపాలా..ఓ బాలుడా..బాలుడా..గోపాలుడా.. హా..ఆ బాలుడా..గోపాలుడా.. హ్హా..హ్హా..హ్హా.. ఈ రాధ కన్నేస్తే గోపాలుడే..మరి ఈ సీత కరుణిస్తే శ్రీరాముడే.. వీడు..ఈనాడు..ఏనాడు..నీ బాలుడే.. బాలుడే..గోపాలుడే..బాలుడే..గోపాలుడే..
Lyrics sourced from public databases. May contain errors.