Dooram Kavala
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- దూరం కావాలా నన్నే విడిచీ
వేరై పోవాలా అన్నీ మరిచీ
ఎప్పుడూ ఒదిగే ఎదపై విసిగీ
దూరం కావాలా నన్నే విడిచీ
వేరై పోవాలా అన్నీ మరిచీ
వేలుని వీడని చేతుల వత్తిడి ఇంకా మరి గురుతుందే
లాలికి వాలిన రెప్పల సవ్వడి ఇంకా వినిపిస్తుందే
గుండెల అంచున పాదము తాకిడి ఇంకా నను తడిమిందే
పూటకి పూటకి పండగలౌ గతమింకా తరిమిందే
ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా నువ్వే లోకం
నీ నాన్నగా నా ప్రేమలో ఉందా లోపం
వేరే దారే వెతికీ ..
దూరం కావాలా నన్నే విడిచీ
వేరై పోవాలా అన్నీ మరీచి
నమ్మిన వెంటనే తొందర పాటున నువ్వే మనసిచ్చావా
నా ప్రతి ఊపిరి నీ ప్రాణములో ఉంచానని మరిచావా
నాన్నని మించిన చల్లని ప్రేమని నీకే పంచిస్తాడా
కన్నుల చాటున మెల్లగ పెంచిన నిన్నే తను కాస్తాడా
నే కోరిన తీరాలనే చూశావేమో
నీ దారిలో ఆ తీరమే చేరావేమో
అయినా అయినా వెళుతూ ..
దూరం కావాలా నన్నే విడిచీ
వేరై పోవాలా అన్నీ మరిచీ
ఎప్పుడూ ఒదిగే ఎదపై విసిగీ
దూరం కావాలా నన్నే విడిచీ
వేరై పోవాలా అన్నీ మరిచీ
- దూరం కావాలా నన్నే విడిచీ
Aakashamantha
Movie More SongsDooram Kavala Keyword Tags
-
-
-