Song Details
Lyrics
తొలిపిలుపే నీ తొలిపిలుపే మనసుకు తెలిపెను పసివలపే తొలిపిలుపే నీ తొలిపిలుపే వయసుకు తెరిచెను చలి తలుపే తొలిపిలుపే నిన్ను నన్ను కలగలిపే తొలిపిలుపే నీలో నాలో కలలను కదిపే తొలిపిలుపే నీ తొలిపిలుపే మనసుకు తెలిపెను పసివలపే తొలిపిలుపే నీ తొలిపిలుపే వయసుకు తెరిచెను చలి తలుపే చరణం: 1 ఒక చూపుతోటి ఒక చూపుకలిపి వెనుచూపు లేని జత పయనమిది ఒక చేయిలోన ఒక చేయివేసి ఒకటయ్యే చెలిమిది ఒక మాటతోటి ఒక మాట కలిపి మొగమాటమైన మగువాట ఇది ఒక గుండెతోటి ఒక గుండెచేరి ఒదిగుండే కథ ఇది ప్రతిపదమూ ప్రియా అని వలచినది ప్రతిఫలమూ ఆశించని మమతల వ్రతమిది తొలిపిలుపే నీ తొలిపిలుపే మనసుకు తెలిపెను పసివలపే తొలిపిలుపే నీ తొలిపిలుపే వయసుకు తెరిచెను చలి తలుపే చరణం: 2 మనసైన వేళ కనుసైగ చాలు పలు దేశభాషలిక దేనికిలే అధరాల పాల చిరుధార చాలు ఆహారం దేనికే ఎదురైన వేళ కౌగిళ్ళు చాలు ఏ ఇల్లు వాకిలిక ఎందుకులే మన చుంబనాల సవ్వళ్ళు చాలు సంగీతం ఎందుకే ఇరువురికీ ఏడో రుచి తెలిసినదీ మనుగడకీ మరోముడై ముడి పడు ముడుపిది తొలిపిలుపే నీ తొలిపిలుపే మనసుకు తెలిపెను పసివలపే తొలిపిలుపే నీ తొలిపిలుపే వయసుకు తెరిచెను చలి తలుపే తొలిపిలుపే నిన్ను నన్ను కలగలిపే తొలిపిలుపే నీలో నాలో నిదురను చిదిపే తొలిపిలుపే నీ తొలిపిలుపే మనసుకు తెలిపెను పసివలపే తొలిపిలుపే నీ తొలిపిలుపే వయసుకు తెరిచెను చలి తలుపే
Lyrics sourced from public databases. May contain errors.