Song Details
Lyrics
నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ నీ పెదవుల ఎరద్రనాన్ని గోరింటాకే అరువడిగింది ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ నీ కోకను సీతాకోక నీ పలుకులు చిలకల మూక నీ చూపును చంద్రలేఖ నీ కొంగును ఏరువాక బదులిమ్మంటు బతిమాలాయి ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ అసలివ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ చరణం: 1 నీ బుగ్గల్లోని సిగ్గులు కొన్ని మొగ్గలకైన ఇవ్వద్దు నా వైపే మొక్కిన నీకైతే అది మొత్తం ఇవ్వచ్చు నీ బాసల్లోని తియ్యదనాన్ని తెలుగు భాషకే ఇవ్వద్దు నాకోసం వేచే నీకైతే అది నాసిగ ఇవ్వచ్చు భక్తి శ్రద్ధ ఏదైనా భగవంతునికే ఇవ్వద్దు భక్తి శ్రద్ధ ఏదైనా భగవంతునికే ఇవ్వద్దు నీకే మొక్కే నాకే ఇవ్వచ్చూ... నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ... నీ పెదవుల ఎరద్రనాన్ని గోరింటాకే అరువడిగింది ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ... చరణం: 2 నీ అందం పొగిడే అవకాశాన్ని కవులకు సైతం ఇవ్వద్దు మరి నాకై పుట్టిన నీకైతే - అది పూర్తిగ ఇవ్వచ్చు నీ భారం మోసే అదృష్టాన్నె భూమికి సైతం ఇవ్వద్దు నీనంటే మెచ్చిన నీకైతే - అది వెంటనే ఇవ్వచ్చు నిను హత్తుకు పోయే భాగ్యాన్ని నీ దుస్తులకైనా ఇవ్వద్దు నిను హత్తుకు పోయే భాగ్యాన్ని నీ దుస్తులకైనా ఇవ్వద్దు నీకై బ్రతికే నాకే ఇవ్వచ్చూ... నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ... నీ పెదవుల ఎరద్రనాన్ని గోరింటాకే అరువడిగింది ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ... నా వాకిట ముగ్గులు నీకే నా దోసిట మల్లెలు నీకే నా పాపిట వెలుగులు నీకే నా మాపటి మెరుపులు నీకే ప్రాయం ప్రణయం ప్రాణం నీకే ఇచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా... బదులిచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా...
Lyrics sourced from public databases. May contain errors.