Song Details
Lyrics
Can you feel her? Is your heart speaking to her? Can you feel the love? Yes... ఏమైందీ ఈ వేళా ఎదలోఈసందడేలా మిల మిల మిల మేఘమాలా చిటపట చినుకేయువేళా చెలి కులుకులు చూడ పల్లవి: ఏమైందీ ఈ వేళా ఎదలోఈసందడేలా మిల మిల మిల మేఘమాలా చిటపట చినుకేయువేళా చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయనేలా ఏ శిల్పి చెక్కెనీ శిల్పం సరికొత్తగా ఉంది రూపం కనురెప్ప వేయనీదు ఆ అందం మనసులోన వింతమోహం మరువలేని ఇంద్రజాలం వానలోన ఇంత దాహం చరణం: 1 చినుకులలో వానవిల్లూ నేలకిలా జారెనే తళుకుమనే ఆమె ముందూ వెలవెల వెలబోయెనే తన సొగసే తీగలాగ నా మనసే లాగెనే అది మొదలు ఆమె వైపే నా అడుగులు సాగెనే నిశీధిలో ఉషోదయం ఇవాళిలా ఎదురే వస్తే చిలిపి కనులు తాళమేసే చినుకు తడిపి చిందులేసే మనసు మురిసి పాట పాడే తనువు మరిచి ఆటలాడే ఏమైందీ ఈ వేళా ఎదలో ఈ సందడేలా మిల మిల మిల మేఘమాలా చిటపట చినుకేయు వేళా చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయనేలా చరణం: 2 ఆమె అందమే చూస్తే మరి లేదు లేదు నిదురింకా ఆమె నన్నిలా చూస్తే ఎద మోయలేదు ఆ పులకింత తన చిలిపి నవ్వుతోనే పెను మాయ చేసేనా తన నడుము ఒంపులోనే నెలవంక పూచెనా కనుల ఎదుటే కలగ నిలిచా కలలు నిజమై జగము మరిచా మొదటిసారి మెరుపు చూశా కడలిలాగే ఉరకలేశా
Lyrics sourced from public databases. May contain errors.