Song Details
Lyrics
అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా భూమి కనలేదు ఇన్నాళ్ళుగా ఈమెలా ఉన్న ఏ పోలిక అరుదైనా చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా చరణం: 1 కన్యాదానంగా ఈ సంపద చేపట్టే ఆ వరుడు శ్రీహరి కాడా పొందాలనుకున్నా పొందే వీలుందా అందరికి అందనిదీ సుందరి నీడ ఇందరి చేతులు పంచిన మమత పచ్చగా పెంచిన పూలతో నిత్యం విరిసే నందనమవదా అందానికే అందం అనిపించగా దిగివచ్చినొ ఏమో దివి కానుక అరుదైనా చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా చరణం: 2 తన వయ్యారంతో ఈ చిన్నది లాగిందో ఎందరిని నిలబడనీకా ఎన్నో ఒంపులతో పొంగే ఈ నది తనే మదిని ముంచిందో ఎవరికి ఎరుకా తొలిపరిచయమొక తియ్యని కలగా నిలిపిన హృదయమే సాక్షిగా ప్రతి జ్ఞాపకం దీవించగా చెలి జీవితం వెలిగించగా... అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా
Lyrics sourced from public databases. May contain errors.