Song Details
Lyrics
అమ్మనుమించి దైవమున్నదా! ఆత్మనుమించి అర్ధమున్నదా! అమ్మనుమించి దైవమున్నదా! ఆత్మనుమించి అర్ధమున్నదా! జగమే పలికే శాశ్వత సత్యమిదే అందిరిని కనే శక్తి అమ్మ ఒక్కటే! అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే! అందిరిని కనే శక్తి అమ్మ ఒక్కటే! అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే! అమ్మనుమించి దైవమున్నదా! ఆత్మనుమించి అర్ధమున్నదా! జగమే పలికే శాశ్వత సత్యమిదే అందిరిని కనే శక్తి అమ్మ ఒక్కటే! అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే! రఘురాముడి లాంటి కొడుకు ఉన్నా తగిన కోడలమ్మ లేని లోటు తీరాలి సుగుణ రాశి సీత లాగ తాను తోటి ఉగాదులే నా గడపకు తేవాలి మట్టెలతో నట్టింట్లో తిరుగుతుంటే మట్టెలతో నట్టింట్లో తిరుగుతుంటే ఈలోగిలి కోవెలగా మారాలి అమ్మనుమించి దైవమున్నదా! ఆత్మనుమించి అర్ధమున్నదా! జగమే పలికే శాశ్వత సత్యమిదే అందిరిని కనే శక్తి అమ్మ ఒక్కటే! అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే! తప్పటడుగులేసిన చిననాడు అయ్యో తండ్రి అని గుండెకద్దుకున్నావు తప్పుటడుగులేసే ఈనాడు నన్ను నిప్పుల్లోనడిపించు ఏనాడు నింగికి నిచ్చెనలేసే మొనగాడినే నింగికి నిచ్చెనలేసే మొనగాడినే అయినా నీ ముంగిట అదే అదే పసివాడినే అమ్మనుమించి దైవమున్నదా! ఆత్మనుమించి అర్ధమున్నదా! జగమే పలికే శాశ్వత సత్యమిదే అందిరిని కనే శక్తి అమ్మ ఒక్కటే! అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే! అందిరిని కనే శక్తి అమ్మ ఒక్కటే! అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే!
Lyrics sourced from public databases. May contain errors.