MovieGQ

Chinnanaati Chelikade

Yagnam (2004) · Track 2 of 6

Lyrics

చిన్ననాటి చెలికాడే చురకత్తిలాంటి మొనగాడే ఇన్నినాళ్ళు నా నీడై ఎదిగాడే చిన్ననాటి సిరిమల్లి ఈనాటి కన్నె జాబిల్లి వెన్నెలల్లె కన్నుల్లో కొలువుందే రమ్మనే తన అల్లరి ఝుమ్మనే నా ఊపిరి సూర్యుడైనా చల్లారడా వాడిలో వేడికి దాడిలో వాడికి ఎప్పుడూ ఆ ధాటి కనలేదని చంద్రుడైనా తలదించడా చెలియ చిరునవ్వుకి చెలిమిలో చలువకి ఎన్నడూ తన సాటి కాలేనని చిగురాకులై కొండలే ఊగవా చెలరేగు వేగానికి సిరిమువ్వలై గుండెలే మ్రోగవా వయ్యారి సయ్యాటకి మాటల్లో మంటలు మనసంతా మల్లెలు స్నేహానికి అర్థమే తానుగా రమ్మనే ఆ అల్లరి కమ్మగా మది తాకెనే తరలి రావా ఆ తారలూ రేయి నడిజాములో వాలుజడసీమలో జాజులై తల దాచుకుంటామని మురిసిపోవా రాదారులు వాయువేగాలతో వేయి సరదాలతో తానిలా వస్తున్న కబురే విని మారాణి పారాణి పాదాలతో ఈ నేల పులకించగా మారాల గారాల గానాలతో ఈ గాలి కవ్వించగా కురిసే చిరుజల్లులు విరిసే హరివిల్లులు ముందే చెలి రాకనే చూపగా ఝుమ్మ్నే నా ఊపిరి ఆమెకే ఎదురేగనీ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Yagnam

See All