Song Details
Lyrics
చెప్పనా చెప్పనా నా కన్నా ఇష్టం నువ్వని నువు లేక నేనే లేనని చెప్పనా చెప్పనా నా కనులకి స్వప్నం నువ్వని నాలో సగ భాగం నువ్వని మనసంటుంది నీతోడు కావాలని నీతో నిండు నూరేళ్లు సాగాలని ప్రాణమే నువ్వని చెప్పనా - చెప్పనా నా కనులకి స్వప్నం నువ్వని నువు లేక నేనే లేనని నీ చూపు నాపై ప్రసరించని నీ ఊహ నాలో ప్రవహించని గుండెలో కొత్తగా ఏమిటీ బరువని అడిగితే అన్నది నువ్వు నిండావని నా చేతి గీత నువ్వేనని నీ వల్లే రాత మారిందని దేవతే నువ్వని చెప్పనా చెప్పనా నా కన్నా ఇష్టం నువ్వని నువు లేక నేనే లేనని నీ నవ్వుల్లోన నది ఉందని మది అందులోన మునిగిందని నలుగురు ఎదురయి అడిగితే చెప్పని అరుదుగా దొరికిన కానుకే నువ్వని వదిలుండలేను నీ చేయిని దాచుంచలేను ఈ మాటని లోకమే నువ్వని చెప్పనా చెప్పనా నా కన్నా ఇష్టం నువ్వని నువు లేక నేనే లేనని చెప్పనా చెప్పనా నా కనులకి స్వప్నం నువ్వని నాలో సగ భాగం నువ్వని మనసంటుంది నీతోడు కావాలని నీతో నిండు నూరేళ్లు సాగాలని ప్రాణమే నువ్వని
Lyrics sourced from public databases. May contain errors.