MovieGQ

Andham Emitante

W/o V. Varaprasad (1997) · Track 5 of 5

Lyrics

అందం ఏమిటంటే అర్థం చెప్పమంటే సందేహం ఎందుకింకా నువ్వేనంటా నాట్యం ఏమిటంటే సాక్ష్యం చూపమంటె నీ ప్రాయం ఆడుతుంటే చూడాలంటా ఔనా చెప్పమంటే నువ్వేమో నవ్వుతుంటె వెన్నెల్లో ఈదినట్టూ వుంటుందంట అందం ఏమిటంటే అర్థం చెప్పమంటే సందేహం ఎందుకింకా నువ్వేనంటా స్వర్గమంటూ ఉంటుందని చెప్పుకుంటూ ఉంటే వినీ ఒట్టిదనుకున్నా ఇపుడొప్పుకుంటున్నా నిను చూస్తుంటే నిజమేననీ వయ్యారాలే వర్ణించుంటే ఇష్టంగా ఉండగా కావాలంటే ఏమిమ్మన్నా ఇచ్చేసే తీరుగా పాపం పైకి మాత్రం జాలేస్తు ఊరుకుండు అంటూనే ఆశ చెప్పీ వింటూ ఉంది అందం ఏమిటంటే అర్థం చెప్పమంటే సందేహం ఎందుకింకా నువ్వేనంటా చిన్నబోతావేమోనని చెంతకొచ్చా పోన్లే అనీ కన్నె సిగ్గంతా తెగ కందిపోతున్నా సరదా తీర్చి పోదామనీ ఐనా ఇంకా ఆసక్తుంటే కష్టంగా ఉండదా అంతో ఇంతో ఔనంటున్నా అంతంటూ ఉండదా పాపం గాలి కుట్టీ ఊ కొట్టీ ఊరిస్తుంటే ఉప్పెనలా ఊపిరొచ్చి ఊపేసింది అందం ఏమిటంటే అర్థం చెప్పమంటే సందేహం ఎందుకింకా నువ్వేనంటా నాట్యం ఏమిటంటే సాక్ష్యం చూపమంటె నీ ప్రాయం ఆడుతుంటే చూడాలంటా ఔనా చెప్పమంటే నువ్వేమో నవ్వుతుంటె వెన్నెల్లో ఈదినట్టూ వుంటుందంట

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from W/o V. Varaprasad

See All